పుట:SaakshiPartIII.djvu/261

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"ఎందుకాగోల! ఎందు కాపనికి మాలిన వ్రాఁత! ఎందు కాతుక్కు ఆపెంట' యని కేకలిడుచున్నారే సరస్వతీదేవి యామాటలు విని సన్నగ సన్నగ నవ్వుచున్న దెందుకో! ఎవ్వరైన నెఱుఁగుదురా? ఎఱిగియుండునెడల నాకుఁ జెప్పరా? మీరు, మీరు. ఇంతలో నా మూలనుండి యేదియో ధ్వని వచ్చుచున్నది. వినుడు ఎవడో మాటలాడుచున్నాఁడు. “పనికిమాలిన వ్రాఁతయా! అబ్బ! మమ్మధిక్షేపించుచున్న మీరు చెప్పిన కవిత పనికి మాలిన వ్రాఁతకాదు కాంబోలునేమి! మీపై వారికవిత ముందు మీరుచెప్పినదియు దుక్కే క్రింది వారివ్రాఁత పైవారి వ్రాంతముందు దుక్కు. అది వారి పైవారి వ్రాంతముందు బెంట. అన్ని కవిత్వములు గాళిదాసుని కవిత్వముముందు దుక్కు. కాళిదాసుని కవిత్వమును పుట్టతేనె కవిత్వము ముందుఁ బెంట. అదియైనను బ్రహ్మాను సంధానమున వేదరుల నుండి నిప్రయత్నముగ నుద్బుద్దమునఁ దపోమాహాత్మ్యమునఁ బ్రకృతికాంతముం గురులలో నొక్క వెండ్రుకలోని వంకరటింకరలైనను సరిగఁ జెప్పలేకపోయిరే, అట్టిచో నెవనికవిత్వము దుక్కు, ఎవని కవిత్వము ముక్కు, ఎవనికవిత్వము పెంట, ఎవనికవిత్వము పంట. అందరు బ్రయోజకులే! అంద ఆప్రయోజకులే! మాకాలమందు మమ్మెట్లు పైవారు తిట్టుచున్నారో, మీకాలమందు పైవారు మిమ్మట్లు తిట్టినవారే. లోకచరిత్ర మన్నియుగములందు గూడ నాడిన యాటయే యాడుచున్నది. కాని యొకచోటఁ గ్రోఁతులభాగవతమాడి యొకచోట గోవిందనామ స్మరణ చేయుట లేదు. బుద్దిలేక పోవుటచేత నెప్పటి కప్పటికే పరాకు. పైమెట్టువారు వారిపై మెట్టువారి మొట్టనుదినుచుఁ దమక్రిందిమెట్టున నున్నవారిని మొట్టు చున్నారు. ప్రపంచమునకు సిగ్లెక్కడిది?" అని ఇంక నేమేమో జంఘాలశాస్త్రియాకాశమంత నోరు పెట్టుకొని మొండి మోటత్రోపుగా బడిత బాజాపద్దతినిఁ బలుకుచున్నాఁడు. సాక్షిసం ఘోపన్యానము లింక గట్టిపెట్ట రాదటయ్యా యని పైమెట్టునుండి వెంకట రత్నముగారు కాబోలు పలికినారు! ఈ వెంకటరత్నము గారికి సాక్షి యనఁగ నింతద్వేష మెందుకో! మహాజనులారా! మరియొక ప్రక్కను జూడుడు. అరువది సమీపించుచున్న వృద్దపండితుల యెదుట నిద్దరు పడుచుపండితులు కూరుచుండియప్పడే యక్షరస్వీకరణ మొనర్చుచున్న యర్బకులవలె “అఆ ఉఊ" అనుచున్నా రేల? వారే సూర్యరాయనిఘంటు కార్యాలయమందలి పండితులు. గ్రామ్యభాషాగ్రంథోపద్రవము నుండి భాషను రక్షించి యుద్దరించిన భాషాకోవిదుఁడైన యాంధ్ర భోజమహారాజు మీ యెదుటనే కానబడు చున్నాఁడు. "భాషోద్గారకా! పుత్రపౌత్రాది సంపత్తితో నిండుగా నూరేండ్డు వర్డిలు మయ్యా మహారాజా!' యని మహాజనులంద రొక్క మా రాశీర్వదింపరా? మహాజనులారా! తెఱ పడుచున్నది. దేవతా దర్శన మిఁకఁ జాలును.

మహాజమలారా! శక్తివంచన లేకుండ శారదాదేవీపూజకై యెందరు గ్రంథకర్తలెంతగాఁ బాటుపడుచున్నారో చూచితిరా? ఇన్ని పాటులుపడి యేమి ప్రతిఫల మొందు చున్నారో యెఱుఁగుదురా? వస్తులు, పరిభవములు. ఈపుస్తకము లన్నియు మంచివికాకపోవుటచేతనే ప్రజలు వాని నిరాకరించుచున్నారా? మంచివో చెడ్డవో చూచినతరువాతఁగదా తెలియవలసి నది. అట్టు చూచినవా రెవరు? చూచుట కోపిక యెవరికి? చూచుటకుఁ దీరిక యెవరికి? చూచుట కంత భాషాభిమాన మెవరికి? చూచుట కక్షరజ్ఞానమైన నెందఱకు? ఆంధ్రదేశ ప్రజలలో విరివిగా లెక్కచూచుకొనిన యెడల నూటికిరువది మంది కాంధ్రభాషాజ్ఞాన మున్న దేమో! చాలు. అంతే చాలును. లేకపోయినప్పడు చాలదని దేవులాడిన లాభ మేమున్నది?