పుట:SaakshiPartIII.djvu/259

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అని పఠించి చాపచుట్టుగ సాష్ట్రాంగదండప్రణామ మిడుచున్న యాజాంబూనదవిగ్రహ మును గాంచి మీకన్ను లానందబాష్పములను విడుచుచున్నవా? ఆహా! అది యేమి? ఆకవిత వినియేనా శారదాదేవి శిరఃకంపన మొనర్చినది! కాక యుభయమహారాజేంద్రుల వింజామరసే వవలననా యామెచెవినున్న చెంగల్వ గదలినది! అట్టు కదలిన చెంగల్వనుండి జరిన యమృత బిందువు లెట్టు వీణాతంత్రులపై బడుచున్నవో నాయనలారా! ఈచర్యయంతయు నామెపీఠమునకు దిగువనున్న రెండుమూడు మెట్టమీదిది! కాని యిదియంతయు మనకేల? దిగుడు; ఏడెనిమిదిమెట్టు దిగుడు; మృచ్చకటికా పరివర్తనమును జూలియస్ సీజరుపరివర్తనమును జేతఁ బట్టుకొని నిలువఁబడిన యాస్టవిష్ణుని గాంచితిరా! బిల్వేశ్వరీయ శంకరవిజయధ్వజాది గ్రంథములను జేతఁ బుచ్చుకొని 'పలుకుదయ్యమా! ఇది పాయస మమ్మా! బమ్మదయ్యపుటల్లాలా! ఇది పానకమమ్మా! త్రాగుమమ్మా' యని తల కంపింప స్పష్టముగ సంబోధించు చున్న యాహ్రస్వరూపుని గాంచితిరా? అదిగో మహేంద్రవిజయ నయనోల్లాస కర్తలగు సోదరకవులు శ్రవణానందముగ శారదాగాన మొనర్చుచున్నారు. విను చున్నారా! వారి గాన మధురిమచే నాకర్షింపబడి కాంబోలు నొక్క శాంతస్వరూపుఁ డైన వృద్దు డటకువచ్చి యారంభించిన భారతము పూర్తికాలేదు; ఇది యమ్మగారి కర్పింపవచ్చునా లేదా యని పీచు కాగితముల పెద్దకట్టను వారికిఁ జూపి యడుగు చున్నాడు. ఆలకించుచున్నారా? ఏవో బరువైన గ్రంథములు పదిసంపుటములు కాంబోలుఁ జేతఁ బుచ్చుకొని యెర్ర మధుర పాగజట్టుకొని దగ్గుచు గష్టమున మెట్టెక్కుచున్న యాముసలి యాయన యెవరో యెరుఁగుదురా? ఈయనను జూచి బిలేశ్వరీయకర్త గుఱ్ఱుమనుచున్నాఁ డేల? తన ప్రసన్న రాఘవ విమర్శనముమాట పరాకు పడినాఁడు కాంబోలు! ఆహా! శతఘంటకపు లిద్దరు —ఒకరు ముసలివారు; నొకరు పడుచువారు. ఒక రెఱ్ఱ నివారు; నొకరు నల్లనివారు. ఒకరు పొట్టివారు; నొకరు రవంత పొడుగువారు. నొండొరులఁ గౌంగిలించుకొని మనగ్రంథములు శారదాదేవి కర్పింతమని యొకరితో నొకరు చెప్పకొనుచుఁ బూర్వవైర ములు వదలి చెట్టపట్టముల వైచుకొని మెట్టు లెక్కుచున్నారు వారిని గాంచితిరా? కాని వీరి కొకటి రెండుమెట్లు ముందు బుద్దచరిత్రమును సరస్వతీసంచికలను జేతఁ బట్టుకొని కంటిజొటితో ముందునకుఁ బోవుచున్న యా భాషాపోషకతేజ మేబ్రాహ్మణ ప్రభునిదో పరిశీలించితిరా?

మహాజనులారా! ఇదివఆకు మనము కాంచినవారందరు గతించినవారు. ఇప్పడు బ్రదికి బట్టకట్టుచున్న వారిని గ్రంథము కలముఁ బట్టినవారి నిఁకముందు చూడదలచియు న్నాము. ఇంకఁ గొన్ని మెట్టు దిగుడు. అదిగో శారదా దేవీ చరణారాధనమునకై యింద్రధ నుస్సు రంగులుగల యెన్ని యోపూవులను దట్టలోఁ బెట్టుకొని యొక్క ముసలియాయన యా మెట్టుమీఁదఁ గూరుచుండి నాడు, కనబడుచున్నాఁడా? అవి భక్తచింతామణిపుష్చ ములు కాబోలు! అచ్చట నొక పెద్దదుకాణమున్నది. చూచితిరా! అదేదో వంగభాషనుండి పరివర్తనమునొందిన బహుళములైన నవలలుగల గ్రంథనిలయము కాబోలు! ఆప్రక్కను ఫర్గాంగు చదరపుస్థలములో దాదాపుగఁ బండ్రెండు గజముల యెత్తు వఱకుఁ బేర్పబడిన యా పుస్తకములసమూహమేదో యెఱుఁగుదురా? అవియే పాటల నాటకములు. ఓ! యెగురుచున్నవి. గిరగిర దిరుగుచున్నవి! నేలపైబడుచు నెంతగందరగోళమైనఁ జేయుచున్నవి. ఈసందడిలోఁ బర్గాకిమిడి వాస్తవ్యుఁడైన బ్రాహ్మణుఁ డొక్కడు నవ్యసంగీతపురాణ