పుట:SaakshiPartIII.djvu/257

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యొకటి. మహాకవినిలయ మగుటచే రక్తికి, మహారాజాస్థాన మగుటచే భుక్తికి, మాధవమహా క్షేత్ర మగుటచే ముక్తికి నిదానమైన యీపుర మాంధ్రదేశ మహిళా మతల్లికంఠ మాలానాయకమ ణియై ప్రకాశించుచున్నది.

ఇదిగాక చీనాదేశపువారి రాయబారి హియా త్సాంగ్ అనునాతండు మన యార్యావర్త దేశమునకు వచ్చి యిచ్చటి విశేషములు వ్రాయుటలో దక్షిణమునఁ బిష్టసుర మనునొక ప్రసిద్దమైనపట్టణ మున్నదని వ్రాసినాఁ డనియు, నంతకు బూర్వుఁడెమడో గ్రీస్తుదేశస్తుఁడు కాఁబోలుఁ బిష్టపురఖ్యాతిని వెల్లడిచేసి యుండె ననియు మ-రా-రాస్త్రీది హానరెబిల్ న్యాయ మూర్తి వేపా రామేశము పంతులుగారు నాతోఁ బలికిరి. ప్రాచీనచరిత్రాంశ విమర్శనాసక్తులగు వారిమాటలను బట్టి యీ పట్టణము దాదాపుగాఁ గ్రీస్తుశకమునకుఁ బూర్వమునుండియుఁ బ్రసిద్ది వహించియున్నదేమో యని యెంచఁదగియున్నది.

మహారాజమందిరము:- అట్టి యీపట్టణమున మహారాజమందిరమున మనసాహిత్యప రిషత్తు సమావేశమైనది. సంగీతసాహిత్య ప్రసిద్దుం డగు కవివర్యుని యనేక చిత్రవిచిత్రార్ధప్రతి పాదనయుక్తమైన వసుచరిత్ర సంగీతపురాణ పఠనము జరిగిన దీ సభయందే. సర్వకామదకుఁ బరిణయ మెందుకోయి యని రామభక్తుఁడైన లక్మణుఁడు కృష్ణమూర్తిని బరిహసించిన దీ సభయందే. బులుసు వారింటఁ బుట్టిన విద్యారణ్యుఁడు. ముప్పది రెండుపుట్ట రత్నగర్బను రామార్పణముగ గ్రహించిన దీ సభయందే. భరతాధ్యుదయాధిపతి శతఘంటక కవిత్వకాల మున శారదా దేవితోకూడ గజైలు కట్టుకొని తాండవించిన దీ సభయందే. రావువంశ ముక్తావ ళిని రామరాజేంద్రుని కంఠసీమ నలంకరించిన యాస్థాన సోదరకవు లర్టసింహాసన మధిష్టించిన దీ సభయందే. కవులకుఁ గనకవర్ష మన్ని ఋతువులందుఁకూడఁ గురియుచున్న దీ సభయందే. నవీన గౌతములు, నర్వాచీన పాణినులు, నూతన బాదరాయణులు విజయదశమినాఁడు మా మహారాజేంద్రునిపై వారి పుత్రపుత్రికాసంతతిపై నాశీఃప్రసవవృష్టి: గురియించుచున్న దీ సభయందే. ఆస్థానవైణికాగ్రగణ్య వీణారవామృతా స్వాదనానశములైన చిలుకలుఁగూడ స్తంభోపరివిటంకముల నుండి సహవైఖరిని ‘రామా" యని యనఁబోయి సంగీతవైఖరిని ‘రీమా" యని యనుచున్నదీ సభయందే. అట్టి యీసభయందుఁ దెనుగు రాయడు మొదలు తెనుగుభాసలో బండితుడు తెలుగుబాసకు బరిపోషకుడు నగు నీ మహారాజువఱకు విద్యా పోషణమునకు విశేషవిశ్రుతి కెక్కి దినదిన ప్రవర్దమానముగ నెక్కుచున్న యితోధికవృద్దిగా నెక్కఁ గల యీసభయందు, రమాశారదా కేళీ మందిరమగు నీ సభయందు మనము నేఁటికి సమావేశమైతిమి. ఎందుకు? ఆంధ్రశారదా దేవీసమారాధన మునకు. ఆహా! ఎంత మహాకార్యమునకై-యెంత మహారాజుచే నాహ్వానింపఁబడి యెంత మహాక్షేత్రమున నెంత మహోన్నతయశస్వంత మైనసభయం దెందఱు మహాకవిపండితులు సమకూడిరో ఆంధ్రభాషా పండితులను, నాంధ్రభాషాభివృద్దికైయత్యంతము శ్రమమొనర్చు చున్న వారును నగు గౌరవ్యులకు శ్రీరాజా పానుగంటి రామారాయణంగారు నిరంతర రాజకార్యనిర్వహణ దీక్షాబద్ధులై యుండుటచే నిటకు దయచేయుట తటస్థింపదేమో యని సందేహించితిమి. కాని యాదృచ్చికమునఁ గార్యాంతరములచే గంజాము మండలమునకు వారు వచ్చి తిరుగ మదరాసునకుఁ బోవునప్పడు తమ మిత్రులగు మా మహారాజుగారిని జూడనిట దిగి పరిషత్సభ నిట్టలంకరించుట భాషాభిమానుల కందఱకుఁ బరమానందముగా