పుట:SaakshiPartIII.djvu/256

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది


ఆంధ్రసాహిత్యపరిషదేకాదశ వార్షికోత్సవసభకు న న్నగ్రాసనాధిపతిగా నియమించి నందులకు మీ కెంతయుఁ గృతజ్ఞఁడను. క్రిందటిసారి యేలూరులో నిట్టిసభ జరిగినప్పడు నన్నగ్రాసనాధిపతిగాం కోరిరి. అప్పటి యనారోగ్యస్థితివలన నేనంగీకరింపక పోయినప్పటికి నన్నుఁ దిరుగ నెన్నుకొని గౌరవించినందుకు మఱింత కృతజ్ఞఁడను.

నేను బండితుఁడను గానని యీయూరివా రెఱుఁగుదురు; పై గ్రామములవా రెఱుఁగుదురు. నన్నెఱిగినంతవఱ కాంధ్రదేశమంతయు నెఱుఁగును. సాహిత్యహీనతలో జనమెఱిఁగినవాఁడను గాని సాధారణుఁడను గాను. ఇట్టి నన్నుఁ బరిషత్తు వారేల యెన్నుకొన వలయునో నాకు దెలియదు. తెలిసినవిషయ మేమియో యంతకంటెఁ దెలియదు 'వెనుక జరిగినది పది పరిషత్సభలకుఁ బండితుల నెన్నుకొంటిమి కదా! ఈసారి యపండితు నెన్నుకొందము. ఇంతలోఁ జెడిపోవున దేమున్న దని యూహించి మార్పుకొఱకైన న్నెన్నుకొని యుందురేమో! ఎటులైన నేమి? అవిలంఘ్య మైన మహాజనులయాజ్ఞ దులసీ దళమువలె శిరమున ధరించి యిటు నిలువఁ బడితిని. నాకు సందేహమెందుకు? న స్టిటనిలువఁ బడుటకు నియమించినవారే నాచేఁ దమకార్యమును నిర్వహింపించు కొసుభారమును వహించి యున్నపుడు పనికి మాలి సందేహము లొందుటకంటెఁ బామరత్వముండునా? కవి కుండం దగిన యోచన, తొట్రుపాటు, సందేహము, నలజడి కవిచేతిలోని కలమున కెందుకు? ఈస్వల్పసాధనమును మీ యిస్టానుసార ముపయోగపఱచు కొని మిమ్ము మీరు కృతార్డులుగఁ జేసికొనుడు. కలముగూడం గాసంత మంచిదే యనునట్టు నన్ను రవ్వంత కృతార్థుడునిఁ జేయుఁడు. చేయుట కవకావము లేక పోయిన బోనిండు. ఇంక గార్యక్రమము ననుసరించి సభాచర్య జరిగింతము. -

సమ్మాన సంఘాధ్యక్షులగు శ్రీశ్రీపిఠాపురమహారాజావారి మనోహరమైన యుపన్యా సమును వింటిమి. దానినిగూర్చి నే నేమైనఁ జెప్పవలసియుండు నెడల నా యుపసంహారోప న్యాసము ముందుఁ జెప్పెదను. ఇంక నా యుపన్యాసమును జదివెదను.

పీఠికాపురము:- ఈసభ పీఠికాపురమునకే తదాస్థానమహారాజువారిచే నాహ్వానింపబ డినది. ఆహ్వానించినవా రెట్టినారు? ఆంధ్రభాషాపోషకులు, నాంధ్రభాషాకోనిదులు, నాంధ్ర భోజబిరుదార్థులు, నత్యంతసుగుణసంపన్నులగు నీ మహారాజుగారు, ఆహ్వానింపఁబడిన దేది? అన్ని దేశ భాషలలో సమృతాధిక మాధురీధురిణీయని యేభాషయాచంద్రార్కభ్యాతిఁ గాంచినదో, యేభాషామతల్లిని సేవించుటచే రాజరాజనరేంద్రుఁడు మన యందఱ యిండ్లలో దేవతార్చన వేదికలపై దివ్యమూర్తులతో పాటు పూజ నందుచున్నాడో యేభాషాయోష నభ్యర్చింటచేఁ గృష్ణదేవరాయల యశస్సింహాసన మష్టదిగ్గజములు వహించుచున్నవో యట్టి యాంధ్రభాషాదేవిని సేవించులు కేర్పాటుకాబడిన సాహిత్యపరిషత్తు. ఆహ్వానించిన దెచ్చ టికి? రామలింగకవి కాలమునకుఁ బూర్వమునుండియే కాక యిప్పటికి గూడ గళింగదేశా భరణమగు పీఠికాపురమునకు, మల్లన్న-ప్రొఢకవి మల్గన్న కాఁడు. పావులూరి మలయమారు తముతో వచ్చిన రసికజన మనోభిరామ పరిమళము లిటకు రెండుబారలలోనివే. లక్షణాపరి ణయ శబ్దాలంకారపు టంగుటంగు లిక్కడికి మూఁడుబారలలోనివే. అయిన నిది కేవలము సారస్వత ప్రాముఖ్యమునందిన పట్టణము మాత్రమే కాదు. శివకేశవసన్నిధానమునఁ బరమపవి త్రమైనది కూడను; పాదగయాక్షేత్రమగుటచే నిది మహాక్షేత్రము. అష్టాదశపీఠములలో నిది