పుట:SaakshiPartIII.djvu/254

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మతమునందలి విశ్వాసముచేతనే మనుజుఁడు మనుజఁ డగుచున్నాఁడు. కాని, లెకిక మైన బుద్దిచేతఁగాదని నమ్మవలయును. ఎంతటి వాఁడైనసరే, యొక్కడివాఁడైనసరే, యశా (స్త్రీయములైన మతవిశ్వాసములు కలవాఁడు మూడుడేకాని మఱియొకడు కాడని యింకను బాశ్చాత్యవేత్తలు మనల నధిక్షేపింతురా? ఊ, అటులే కానిమ్ము, బ్రహ్మర్షులతో పాటు మనము తప్పునఁ బడియుండుటే తగునుకాని పాశ్చాత్య శాస్త్రవేత్తలతోపాటు సందేహహతులమై భ్రష్టత్వమొందుట తగదు. అనాగరకులలో నధము లనిపించుకొన్న మన మాస్తికులమై యుండదము; కాని నాగరకశిఖామణులని పించుకొనుచు నాస్తికులమై యుండ వలదు. అమ్మా! ఎవరు చూడవచ్చినారు. ఏమో! ఏమో!! ఏమో!!!

(భారతినుండి పునర్ముద్రితము)