పుట:SaakshiPartIII.djvu/253

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చున్నది. గణితశాస్త్రప్రావీణ్యము Heredity వలననే కలుగుచున్నది. కాని కాంతాలపట త్వముమాత్రము దానివలనఁ గలుగుట లేదంట! ప్రబంధరచనా నైపుణ్యము Herediy వలననే కలుగుచున్నది. కాని, వైరాగ్యజ్ఞానసంపత్తి దానివలనఁ గలుగుటలేదంట! సరే, కలుగుటలేదు. దేనివలనఁ గలుగుచున్నదని వీరి నడిగినయెడల నాత్మ నొప్పకొనవలసి వచ్చునను భయముచేత Science యుంకను Progress అయిన కొలది దెలియునని కాఁబోలు మూకీభావమును వహించుచున్నారని వినుచున్నాను. ఏమైనాసరే కాని వీ రాత్మ నొప్పకొ నుట కిష్టపడరు.

"This doctrine (Transmigration) famous in antiquity and still held as a religious tenet by certain sects of the civilised world has its roots far back in primitive culture. It is developed out of three universal savage beliefs, (1) that man has a soul; (2) that animals and plants have souls; (3) that souls can be transferred from one organism to another.”

అమ్మా! వింటివా! ఆత్మాస్తిక్య విశ్వాసమున్న మనలను బాశ్చాత్యసిద్దాంతులు Savages అని పిలుచుచున్నారు. కాని యింత నాగరకత యుండియు నింత శాస్త్రజ్ఞాన ముండియు Heredity lntellectual Side ననే కాని Moral Side న బని చేయవని చెప్పు నట్టి వీరిని మన మేమని పిలువవలయునో? జవుననటికాయ లాగున మనస్సున కొకప్రక్కను బుద్దిభాగము, రెండవ ప్రక్కను నీతిభాగము నున్నవని వీరి యభిప్రాయము కాబోలు! సరే. ఎటులో యొకటు లుండుఁగాక! సగము మనస్సుపై బనిచేసినది. మిగిలినసగము పై నేలపనిచేయదో? నీటిలో ముంచిన గుడ్డకుఁ బడుగు తడిసి పేక పొడిగనుండునా? అమ్మా! ఆత్మవిశ్వాసము పునర్జన్మ విశ్వాసమున్నఁగాని యీలెక్క 'కజబాజ'లు గిట్టవు. బుద్దిచేతనే ప్రపంచపుఁ గట్టుకథను విప్ప సాధ్యమగునా? ప్రపంచమున మన లెకిక బుద్దికి స్వాధీనమైనది రూపాయ కొక్క యరపైసంతయిన గాదే. మిగిలినదంతయు భగవద్వాక్యములని మనము నమ్మినవానివలనను సమాధినిష్టాగరిష్ణులై యపరో కజ్ఞాననిక్షేపులైన మంత్రదష్టల పలుకులవల నను దెలిసికొనవలెను. Nonsense అది మూఢవిశ్వాస మని పైవారందురా? అది Nonsense అనీ క్రిందిదానిని వారేమందురో? “One cannot accept the theory of Evolution or the theory of Heredity built upon the Evolutionary hypothesis without discording the Bible and rejecting the dominent note in Christianity. We are not progeny of the brute. We have not tumbled upward by chance but rise by a power which finds its highest Expression in Christ.” WJ. Bryan అను నొక పాశ్చాత్యవిద్వాంసు డీమాటలను వ్రాసినాడు. Evolutionary heredity ని బూర్తిగ ఖండించిన వారిలో నితఁడు ప్రముఖుఁడు. ఈతండుబ్రేకమున “God or Gorilla?” యని అఱచినాడు. “Theworldfamouslawyer, politicianandorator” అని ఖ్యాతి చెందినవాఁడు. అమ్మా! ఈత డింక నేమని వ్రాసెనో విందువా? “I would propose the Bible as a substitute for all materialistic doctrines, because the Bible is not only the foundation of ever present standard of morals but also gives us our only conception of God and Jesus Christ.