పుట:SaakshiPartIII.djvu/252

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నుత్తమలోకము లందు దత్పుణ్యఫలక్షయ మగువలకు మహాసుఖమంది యటుపిమ్మట మర్తృలోకమునఁ దిరుగ జన్మించును. ఉత్కృష్ణ పుణ్యకార్యములు కాని, పాపకార్యములు కాని సామాన్యముగాఁ జరించి మరణించిన వానిసూక్ష్మ శరీరమునకు వెంటనే పునర్జన్మము సంభ వించును. విశేష పాపకర్మము లొనర్చినవాఁడు మరణించి శ్వ సూకరాది జంతువుల గర్భమందుఁ బుట్టును. పునర్జన్మ మెత్తవలసిన జీవుఁడు తన కర్మానుగుణమైన తావు చూచుకొని ప్రీహిమూలమునఁ బురుషుని యుదరమునఁ బ్రవేశించి యటనుండి మాత్పగ ర్భకోశమునఁ బ్రవేశించును. పుట్టఁదఁలచిన జీవుఁడు తనంతతానే ప్రయత్నించి పుట్టుచున్నాఁడు; కాని మన ప్రయోజకత్వముచేఁ బుట్టుచుండుటలేదని స్పష్టముగఁ దెలిసికొ నవలయును. జీవుని వదలకుండ వెంటాడించు చున్న యతని సూక్ష్మశరీరము కూడ జీవునితో పాటే తల్లి కడుపునఁ బ్రవేశించును. ఈసూక్ష్మ శరీరము కూడ జీవునితో పాటే తల్లికడుపునఁ బ్రవేశించును. ఈసూక్ష్మ శరీరములో నేమున్న వనంగా: అనేక పూర్వజన్మ ములలో జీవుఁ డొనర్చుకొన్న కర్మముల ఫలమున్నది. అదికాక విద్యయున్నది. విద్య యనంగా వేదవేదాంత జ్ఞానము, శాస్తాదిజ్ఞానము మొదలగునవి. ఇదికాక ప్రతిభ యున్నది. ప్రతిభ యనంగా బుద్దివికాసము, లలితకళా ప్రావీణ్యము, వాక్చతురత, వ్యవహార నైపుణి మొదలగునవి. ఈశక్తులన్నియు దల్లి గర్భమునఁ దనంత దాను ప్రవేశించినజీవుని సొంత సొమ్ము కాని తల్లిదండ్రులిచ్చిన వెంతమాత్రమును కావు. ఇక్కడనే నశించిపోవుట కర్దమైన స్థూలశరీరమును (దేహము) మాత్రమే తల్లిదండ్రులు బిడ్డ కిచ్చుచున్నారు. ఈ దేహమైనఁ దల్లిదండ్రులు బిడ్డకు యథాక్రమముగఁ బూర్తిగ నిచ్చుచున్నారా? ఈయ శక్తిగలిగి యున్నారా? కల్ల అట్టే యగునెడల నిందఱు వికృతాంగులు, నిందఱు నపుంసకులు, నిందఱు రాకాసిరూపులు ప్రపంచమున నుండనేల? బిడ్డనికి దేహమిచ్చుటలోఁ దల్లిదండ్రులు బిడ్డని కర్మమునకుఁ దమ కర్మమునకు గూడ ననుగుణమగు నంతవజకే దేహమిచ్చుచున్నారు. ఎటు లిచ్చినను బ్రధానముగఁ దెలియదగిన యంశమేదనఁగా: బిడ్డకుఁ దల్లిదండ్రులిచ్చు నది దేహమే కాని తద్వ్యతిరిక్త మెంతమాత్రము కాదు. మన స్సనునది బిడ్డనిదే. దానిపై దల్లిదండ్రుల కధికారము లేనే లేదు. అందుచేతనే యొకనికిఁ బుట్టిన యెనమండ్రు కొడుకు లలో నొకండు మహాబలాఢ్యుం డగుచున్నాడు. ఒకడు కాలుచేతులులేని మొండె మగు చున్నాఁడు. ఒక డెనుబది సంవత్సరములు పూర్ధారోగ్యమున జీవించుచున్నాడు. ఒకఁ డెనిమిదవదినమున సందుగొట్టి చచ్చుచున్నాఁడు. ఒకడు మహాకవి యగుచున్నాఁడు. ఒకడు నిరక్షరకుకి యగుచున్నాఁడు. ఒకఁడు పరమహంసశిఖామణి యగుచున్నాఁడు. ఒకడు బందిపోటుదొంగ యగుచున్నాఁడు. ఈ వ్యత్యానముల So Heredity సమన్వయింపఁగలదా? ఊహు.

పాశ్చాత్య వేదాంతులలో నూతనముగఁ గొందఱు మఱియొక యభిప్రాయమును బడుచున్నారని వినుచున్నాను. Heredity వలన బిడ్డని దేహపరిణామము లన్నియు బూర్తిగఁ గలుగుచున్నవని వీ రంగీకరించుచు మనఃపరిణామములోఁ గొన్ని మాత్రమే Heredity వలనఁ గలుగుచున్నవని వీరభిప్రాయ పడుచున్నారు. ఆకొన్ని యేవనగా:- బుద్దివికా నముతోఁ జేరిన మనఃపరిణామములు మాత్రమే Herediy వలనఁ గలుగుచున్నవి. కాని పుణ్యపాప సంబంధంతోఁ జేరిన నడవడి మాత్రము Heredity వలనఁ గలుగుటలేదని వీరి యభిప్రాయమైనట్టు కనబడుచున్నది. గణితశాస్త్రప్రావీణ్యము Herediry వలననే కలుగు