పుట:SaakshiPartIII.djvu/248

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నేదైన స్థాపించి యుపన్యాసము లిచ్చుచు నాంధ్రదేశమునం దిరుగ సమంజసమైన సంచలనము, సంతోషము నెప్పడు సమకూర్చునా యని నిరీక్షించియున్నా మనియు మీరు వ్రాసి భాషాభిమానమును వెల్లడించినందులకు సంతసించితిని గాని యాతఁడే మీబహిరంగలేఖను దన ప్రథమ సాంఘికోపన్యాసమున విమర్శిం పవలయును గాని నీవు దొందరపడి దానిని విమర్శింప వలదని శాసించితి రేల? ఆతడు వచ్చుపిమ్మట నటులే జరుగవచ్చును గాని యంత వఱకు నేను వేచియుండ నేల? ఆతడు విపులముగ విమర్శించిన విమర్శించుగాక! నేను నా యల్పశక్తిననుసరించి సంగ్రహముగ విమర్శింపకుండుట తగదు. కావున నందులకు మీ యనుజ్ఞ కోరుచున్నాను.

అమ్మా! నా బహిరంగలేఖలో మీరు విమర్శించిన దొక్కటే వాక్యము. Heredity వలనఁ దల్లిదండ్రుల దేహలక్షణములు కాదాచిత్కముగ బిడ్డలయందు సంక్రమింపవచ్చును గాని మనో లక్షణము లేవియు నట్టు సంక్రమించుట కవకాశములేదని నా వాక్యమునందలి యనిప్రాయము. నేను దల్లిదండ్రుల లక్షణములు మాత్రమే యెత్తుకొంటని. అవియైనఁ గాదాచిత్కముగ సంక్రమింప వచ్చునని నే నంటిని. మరికొన్న తరములవారి దేహలక్షణ ములు గూడ బరీక్షింపవలయు నని మీరంటిరి. అది చాలక పోవునెడల నింకను బైకిఁ బోవలయునని కూడ మీరు చెప్పితిరి. దేహలక్షణ పరీక్ష కంత విశాలమైన యవకాశమును మీరు కల్పించు కొనినను, బూర్వుల దేహలక్షణములన్నియు బిడ్డకుఁ తప్పకుండ సంక్రమిం చునని మీరును జెప్పంజాకపోయితిరి. మీరిచ్చిన యుదాహరణముల బట్టి చూడఁగ నెవరివో కొన్ని దేహలక్షణము లెప్పడో యొకప్ప డేదోబిడ్డకు సంక్రమించునని స్పష్టముగ దేలుచున్నది. అట్టిచోఁ గాదాచిత్కముగ సంక్రమించునని నేనంటినని నాతో మీ కింతవాద మెందులకు? Heredity ని గూర్చి పదునాల్గు తరముల వఱకైనఁ బరీక్షించుట గూడ మీ యభిమతమైనట్టు కనబడుచున్నదే! అట్టి పరీక కవకాశ మెట్టు? తరమునకు సామాన్య ముగా ముప్పదిసంవత్సరములు చూచుకొన్నను బదునాల్గుతరములగుటకు 420 సంవత్సర ములుపట్టునే! ఈలోపల నెన్నివందలజనమో పుట్టి చచ్చియుందురు గదా! ఈవంశములోఁ బుట్టిన మగవారి కొఱకుఁ దెచ్చుకొన్న యాడు పిల్లల వంశములో వారి నందఱ లెక్కపెట్టు కొన్న యెడల మఱికొన్ని వందల జనాభా తేలుచున్నదే అధమసంఖ్యగా జూచుకొనుటచే వందల వఱకే తేలినదే కాని యనేక సంతానయుక్తులైన వారి వంశములో నీ సంఖ్య వేలవఱ కెగబ్రాకు ననుట కేమైన సందేహమా? ఈ సహస్రజన సంఘములో నెవనిదో యొకనిపోలిక యిప్పటి తరములో బుట్టినబిడ్డకు సంక్రమించును గావున Heredity సత్యమని మీరు వాదించుచున్నారా? వేలకొలది జనుల పోలికలో నెవరిదో యొకనిది బిడ్డకు సంక్రమింపకుండ నెట్టుండగలదు? మఱియొకవంశములోని వేయిజనుల దేహ లకణములు మాత్రమీ వేయిజనుల దేహలక్షణములకంటె భిన్నముగ నుండుట కవకాశ మున్నదా? ఇంతదూర పరీక్షవలన మనుష్యుల లక్షణములేకాని వంశస్టుల లక్షణములు నిర్ణయింప శక్యమగునా? అందువలన వంశములోని Heredity కి భంగము కలుగుచున్నదని మీరేల గ్రహింపలేదు? కప్ప, యిలకోడి లక్షణములు కూడ మనయందు గనిపించుచున్న పనికూడ మీరు వ్రాసినారు. ఇది సర్వప్రాణికోటి సంబంధమై సామాన్యలక్షణక్రమమై యుండవచ్చును. అంతేకాని మనకు వివాదాంశమై వంశము లోని Herediry కి సంబంధించినది మాత్రము కాదు.