పుట:SaakshiPartIII.djvu/237

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పట్టు పట్టకుము. ముంగురులు కత్తిరించుకొని యిజారు తొడికికొని సైకిలెక్కి నందువలన మీ కెంతమగతనము వచ్చినదో యామాత్రపు స్త్రీత్వ మాతనికి రాకపోలేదమ్మా! ఇప్పటి నటులు బాగుగనే యభినయించు చున్నారు. కొంద ఱుత్తమస్థాన మాక్రమింప నున్నారు. నాట్యకళాభివృద్ది కెందఱో పాటు పడు చున్నారు. బుద్దిమంతులైన విమర్శకు లాకళపై గ్రంథముల వ్రాయుచున్నారు. నాటక పరిషత్తు నొకదానిని స్థాపించి తత్కళాభివృద్దికి మార్గములు యోజించు చున్నారు. భరతశాస్త్రాభ్యసమునకై భరతముని బ్బంద మొకటి స్థాపింపబడినది. అమ్మా! ఏకళలోనైన నుత్తమస్థితి త్వరలో లభించునా? పాటుపడగఁ బడక లభింపక మానునా? నాట్యకళకు సుదినములు రాగలవని తోఁచుచున్నది.

అమ్మా! మఱియొకమాట. పాశ్చాత్య వనితలకుఁ గలిగినంత యభివృద్ది దశ మీ కింక రాలేదని చీటికి మాటికి విచారింపవలదు. అట్టు విచారించి వారిపద్దతులను మీ రవలంబింపఁ బ్రయత్నింప వలదు. వారి యభివృద్ధి దశతో వారేమో విసుగు జెందియున్నట్టు కొలఁదిగాఁ గనబడుచున్నదనియు, సర్వసౌఖ్యాకరమైన సమస్త గౌరవవభాజనము సర్వమధుర మైన గృహిణీత్వ పదము నపేక్షించు చున్నట్టగపడు చున్నదనియు నింకొక పదిసంవత్సరములలో వెనుకకు నడచినడచి యథాస్థానమును జేరవచ్చుననియు నొకపాశ్చాత్య గ్రంథకర్త “The Modern Girl nonsense” eyko శీర్షికతో మొన్న మొన్న వచ్చినTitbits లోదన యభిప్రాయ మును వెల్లడించినాడు. దానిని నీవు చూడవచ్చును.

అమ్మా! పురుషులు స్త్రీపాత్రముల ధరించి జాతికంత యప్రతిష్ట తెచ్చుచున్నా రన్నవిషయము జంఘాలశాస్త్రి పక్షపాతబుద్దిచేత విమర్శించుట మానినాఁడని నీ వాతని నిందించితివి. ఈ విషయమున నిన్ని చిక్కులుండుట చేతనే మానివైచి నాఁడు. కాని పక్షపాత బుద్దిచేఁ గాదని నే ననుకొందును. జంఘాలశాస్త్రిని నేను రవంత యొఱిగినవాడ నగుటచే, నాత డిప్పడు బదరీనారాయణమున నుండుటచే నాతని పక్షమున నేను నీకి ప్రత్యుత్తర మీయ వలసివచ్చినది. కాని యాతండు కొలఁది కాలములో మనవైపులకు వచ్చుననికింవదంతి యున్నది. వచ్చుటయే సిద్దించునెడలఁ దిరుగ నేదో యొక సంఘమును స్థాపించి కొంత గడబిడ చేయకమానడు. అమ్మా! సౌభాగ్యవతివై యాయుష్మతివై సంతానవతివై సుఖమున నుండుము.

(భారతినుండి పునర్ముద్రితము)