మీయూహము లెట్లున్నవి? మీ పలుకు లెట్లున్నవి? మీరచన లెట్లున్నవి? మీచేష్టలెట్లున్నవి? ఆ, ఆ ! పడఁతుల మర్యాదనుగూర్చి పరిహాసములా? వెక్కిరింతలా? అల్లరులా? పటములా? బజారులోఁ బ్రదర్శనములా? ఆఁ ? ఏమనుకొనుచున్నారు? మంచిచెడ్డ లక్కఱలేదా? భయోభక్తు లక్కఱలేదా? పుణ్యపాపము లక్కఱలేదా? తల్లులున్న మీరు-చెల్లెండ్రున్న మీరు-అక్కలున్న మీరు-కన్నయాఁడుబిడ్డలున్న మీరు నాదేశమందలిస్త్రీల విగ్రహములను సృష్టించునప్ప డర్ధ దిగంబరస్వరూపములను సృష్టించుచున్నారుకాదా? ఎందుకొరకు? ముచ్చటకొఱకా? వేడుకకొఱకా? తేఱిపాఱఁ జూచుటకొఱకా? చూచి కిసుక్కుమనుటకొఱకా? బజారులోఁ బెట్టుటకొఱకా? ప్రజల నాకర్షించుటకొఱకా? పది రూపాయలఁ దెచ్చుకొని కడుపు నిండించు కొనుటకొఱకా? ఆడుదాని రహస్యావయవములను జిత్రించి ప్రకటించి యంగడిలోఁ బెట్టుకొని యమ్ముకొని యాఁకలితీర్చుకొనుచున్నారా? ఇంతకంటె నీకు బ్రదుకుతెరు వేదియుఁ గనఁబడలేదా? కాక ఇది ఖ్యాతికారణమని యిందు దిగితివా? ఇది పరమార్థ మని దీనితోఁ దరింతునని జన్మరాహిత్య మొందుదు నని యూహించితివా? రామరామా! కానగూడని యవయవములను గోనపైకెక్కించితివే? చెప్పరాని యవయవములను విప్పి బట్టబయలు చేసితివే? స్మరింపరాని యవయవములను సంతలోఁ బెట్టితివే? నిన్నేమనవలసియున్నది? ఎంతసేపు నాఁడుదాని గుప్తావయవములపై దృష్టియా? వానిప్రతిబింబములను మనస్సులో దింపుకొనుటా? వానిని కాగితముపై నెక్కించుట? ఒంటివెంట్రుక కుచ్చుతో రంగులు పూసి యెత్త పల్లముల విభజించి వెలుఁగునీడల వివరించి ఓ-తబిశీల్లపై దబిశీళ్లతోఁ జిత్రించుటా? ఇది పశుత్వము గాక పాండిత్యమగునా? యథార్థముగా బురుషులు ప్రబలకామాతిరేకులు. సంతతగ్రామ్యసుఖాభిలాషులు. అంగనారహస్యాంగ సంతతసందర్శనాభీష్ట భూయిష్టులు. నాదేశమం దెల్లెడల నిండియున్న జమీందా రులలో నూటి కేఁబదుగురవఱ కీవ్యాపారమునఁ బండితాగ్రగణ్యులు.
వయసు హెచ్చిన కొలఁది వీరి కావాంఛ హెచ్చగుచున్నది. తలవడఁకినకొలఁది యాతలఁపు బింకమగుచున్నది. అస్రపటిమ తగ్గినకొలఁది యాయభిలాష హెచ్చగుచున్నది. అనుభవశక్తి తగ్గినకొలఁదియాలోకనరక్తి మైుగ్గగుచున్నది. గాడిదకంటెను బందికంటెను గుక్కకంటెను నధమాధములైన యిద్దఱుముగ్గురు గుడిసెవ్రేడిముండలను వీరు భద్రపఱచి ముక్కులపైఁ జత్వారపుజోళ్లతోఁ, జేతులలో భూతద్దములతో, నాకులాటధామలయెదుట వీ రొనర్చు నసందర్బతలు, నల్లరులు, నాసురచేష్టలు హరహరా! చెప్పఁదగదు. వినఁదగదు. తలంపఁదగదు. జరుగుఁబా టున్న జమీందారు లిల్లొనర్చుచుండగా నదిలేని యితరపురుషులు దిగంబరచిత్ర లేఖనములతో ముచ్చటలు దీర్చుకొనుచున్నారు. మొత్తముమీఁద బురుషులకందఱ కీరోగమున్నది.
చిత్రలేఖకులారా? మీ రిట్జయవకతవకచర్య కిఁక నాశ్వాసాంతము చెప్పవలయును. అనంతసృష్టిలోఁ జిత్రించుట కెన్నివిచిత్ర వస్తువులు లేవు? అనంతమగు గ్రంథజాలములో వెన్ని యద్భుతపరిస్థితులు లేవు? బాహ్యప్రపంచమందలి పరమాకర్షకసన్నివేశము లట్టుండంగా వాంతరప్రపంచమునఁ జిత్రవిచిత్రాతిచిత్రమహాచిత్రపరిస్థితు లెన్నిలేవు? వానిలో నొక్కదానిని బూర్ణముగఁ జిత్రించుటకు మీకుబ్రహ్మ యిచ్చిన యాయువు చాలదే. అట్టిచో వేవి పవిత్రము లని, గుహ్యములని, ప్రకటనబాహిరము లని దర్శనమువలనఁ బుణ్యక్షయక