పుట:SaakshiPartIII.djvu/206

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాతండు కూరుచుండెను. తిరుగ విష్ణువు ప్రత్యక మయ్యెను. ఒక్క జన్మముకంటె నే నెత్తను. నా కప్పటికైన మోక్ష మిమ్మని యాతండు ప్రార్డింపఁగా సరే యాడు జన్మ మెత్తు మని విష్ణుం డానతిచ్చెను. ఆసాధువే యీయిల్లా లై పుట్టైనట. పూర్వను సాధువున కలవాటున్న సూర్యోపాసన యీమె స్త్రీజన్మమునఁ జేసికొనెనట. దేవతార్చన సంబంధ మగు నగ్నిజ్వాలచేఁ జీర యంటుకొన నొడలు కాలిపోయెనట. అపవిత్రాగ్నిచేఁ గాలినది జన్మపరంపర కాని శరీరము కాదట. ఇంక నేమేమో యరుంధతిగా రుపన్యసించినారు. ఆమాటలు నాకు దెలియలేదు. ఈమె మహాలక్ష్మీ సన్నిధానమున శాశ్వతముగా నుండునట." ఇవే నేను విన్న మాటలు. కాంతలారా! మీరు చేయఁ గూడనిపని యొక్కటి యున్నది. అది యేదనంగా, ఆమె యీపాప్రపంచమును వదలిపోయిన దని యెన్నఁడు కంట నీరు పెట్టవలదు. మీరు చేయవలసినపను లున్నవి. అవియేవో చెప్పెదను.

ఆమె పేరు తలంచుకొని కీర్తింపుడు. ఆమె స్వరూపమును దలంచు కొని పూజింపుడు. ఆమె యోగ్యతను దలఁచుకొని యనుకరింపుడు. ఆమె ప్రేమను దలంచుకొని భగవత్ర్పేమ యట్టిదేయ నుకొనుడు. ఆమె స్వార్జహీనతను దలఁచుకొని మహోత్తమజీవులతత్త్వమదియే యనుకొనుడు. అఖండములైన సర్వసౌఖ్యములం దామె యంటిముట్టనట్టుండిన చర్యను దలఁచుకొని మోక్షమున కిదియే ప్రథమలక్షణ మనుకొనుడు. అట్టి దేవతాతేజస్సు లోకసంగ్రహార్టమై యవతరించి యొక్క సారి రప్పమని వెంటనే శాంతించిన దనుకొనుడు. ఆమెకు జయజయ ధ్వానములిండు-జయ మహాలక్ష్మికి జయ-జయ చిన్నమ్మతల్లికి జయ జయ, ఆండాల్మహాదేవికి జయా-జయా-జయా, మహాపతివ్రతతామ తల్లికి జయ (సభలో నొకరు) యోగినమ్మా! మమ్మేడువవలదని చెప్పి మీరే యేడ్చుచున్నారేమి? అమ్మా! నిజమే. ఈమె యుత్తమగుణము లొక్కసారి మనము స్మరించుకొనుటచేతనే మనకింత దుఃఖము కలుగుచుండంగా దాదాపుగా ముప్పదిసంవత్సరము లామెతో సర్వసౌఖ్యము లనుభవించిన యామహాప్రభుఁడు నామెతో నేకప్రాణుడైన మహాప్రభుడు యేకపత్నీవ్రతుడైన మహాప్ర భువు తరుగని దుఃఖములో మునిఁగియున్నాఁ డనుట యాశ్చర్యమేమి? కాంతలారా! నిత్యమామెను స్మరియించుకొనుచు సంసారములఁ జూచుకొనుచు సుఖముండుడు.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః