పుట:SaakshiPartIII.djvu/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కెంతయైన వగచుచున్నాను. దైవకటాక్షమున నట్టి యంతరాయము లింకముందు రాఁబోవని యంతరంగమున నమ్మియున్నాను.

నాయనలారా! నాప్రక్కను గూరుచుండిన యీశాస్త్రిగారు తుంగభద్రాతీరగ్రామవాసులు. ఈయనకుఁ జిత్రకళానైపుణ్యము కొంతకలదు. చిత్రకళాశాల లన్నిటికిఁ బోయి వానిలోని చిత్రములను సందర్శించుపనిపై స్వగ్రామమునుండి కొంతకాలము క్రింద బయలుదేఱి తిరుగుచు మన గ్రామమునకు దయచేసినారు. వారీదినమున నుపన్యసింతురు. మీరు శ్రద్ధాళువులై వినఁగోరు చున్నాను. అయ్యా! శాస్త్రిగారూ! మీ రింక నుపన్యసింతురుగాక.

శాస్త్రిగారియుపన్యాసము-స్వప్నము

చిత్ర లేఖనమునందుఁ బ్రావీణ్యమార్జింపఁ దలంచి కొన్నిమాసములనుండి యాంధ్రదేశమందలి చిత్రకళాశాలను సందర్శించుచున్నాను. అనేకములైన చిత్రములను జూచినాను. కొన్ని స్త్రీవిగ్రహములకుఁ బైట లేదు. కంచుకమును లేదు. అన్నిస్త్రీ విగ్రహములకు నాభి కానబడుచున్నది. అనేకవానికి చీరకట్టు బొడ్డునకు రెండు బెత్తిళ్లు దిగువగ నారంభింపఁ బడియున్నది. కొన్నివిగ్రహములకు జీరకట్టలేదు. లేకున్నను మర్మస్థానములూరువిన్యాసాదిపరిస్థితుల వలన రవంత గుప్తములుగ నుంచఁబడినవేమో యనంగ రామరామా! అట్టుకాదు. ఏమని చెప్పదును? ఇట్టి విగ్రహములు సంతోషమిచ్చుటకు బదులుగ సంతాపము నిచ్చినవి. ప్రీతి నిచ్చుటకు బదులుగ రోఁత నిచ్చినవి. బుద్దిమంతులగు చిత్రలేఖకులు వాని నట్లే వ్రాసిరో యని యూహించుకొనుచుఁ బండుకొంటిని. ఒకస్వప్నము వచ్చినది. స్వప్నానంతర మాస్వప్నములో నేనుఁ విన్నదంతయు స్వప్నములో సహజముగఁ గల్లునసందర్భతలను సవరించి సందర్భశుద్దిగ నాశక్తికనుగుణమగునట్టు వ్రాసితిని. స్వప్నములో నొక్కడు నన్నుఁ బిలిచి నన్నుఁ దనతోంగూడ రమ్మనినాఁడు. మాటలాడకుండ నాతనివెంటఁ బోయితిని. ఆతఁడు నన్నొక్కసభలోనికిఁదీసికొనిపోయినాఁడు. ఆసభలో ననేకపురుషులు కూరుచుండినారు. నేను నొకబల్లపైఁ గూరుచుంటిని. ఉపన్యాసరంగమున నొక్క యువతి మాత్రము నిలువంబడి యున్నది. ఆమె యమానుషతేజస్సమన్వతమై యున్నది. ప్రసన్నతలో భయానకత్వము, శాంతిలో దీవ్రత, వెన్నెలలో నెండ, కరుణలో గాఠిన్యము నామెవదనమందు సమంజసముగ సమ్మేళన మొందియున్నవి. ఆమెకుడిచేతిలో నొక్క కొరడాయున్నది. ఆచేయిచాపి యామె యుపన్యసించుచున్నది. నేను సభలోని కేగకముందామె యేమిచెప్పెనో నాకుఁ దెలియదుకాని నేను గూరుచుండిన పిమ్మట నా కీమాటలు వినఁబడెను.

'మీకుఁ దెలియునా? చెప్పిననైనఁ దెలియునా? ఆఁడుదాని మర్యాద యెట్టిదో మీరు గ్రహింపఁ గలరా? అది యాకాశముకంటె స్థూలమైనది. సూదిమొనకంటె సూక్ష్మమైనది. అది వజ్రముకంటెఁ గఠినమైనది. గాజుకంటెఁ బెళుసయినది. అది శతకోటికంటె శాంతమైనది. శిరీషముకంటె మృదులమైనది. జీవాత్మతత్త్వమును గ్రహియింపవచ్చును. జగత్తత్త్వమును గురైఱుంగవచ్చును. పరమాత్మ తత్త్వమును భావింపవచ్చును గాని మానినీమానసతత్త్వము గ్రహింప మీతరమా? అది మీదృష్టికి కానునా? మనస్సున కందునా? బుద్దికిఁ బొడకట్టునా? అదిగో యనుసరికి మాయ మగునే? మనన మొనర్చిన కొలఁది మానసాతీతమగునే అట్టి యసాధ్యమైన తత్త్వమునుగూర్చి, అట్టి యజ్ఞేయమైన తత్త్వమునుగూర్చి