పుట:SaakshiPartIII.djvu/171

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దాసి యక్కడనే యున్నది. అదిచూడదా? అదిపైకిఁ బోయి యేవియో తెలివితక్కువమాట లాడకుండునా?

షాజ:- దాని నావలికిఁ బొమ్మని చెప్పము.

కిన్నె-యాకుతీ! ఇటురా! (యాకుతి వచ్చును.)

యాకు:- పర్వద్దిగార్ (పాదుషాకు నమస్కరించును.)

షాజ:- నీ వీగదివెలుపల నేను బిలుచువల కుండుము. (యాకుతి పోవును.)

కిన్నె- నే నొక్కసారి లోనికిఁ బోయి పన్నీరుతెచ్చి మీపై జల్లెదను. (కిన్నెతు పోవును.)

షాజ:-ఈయుత్తర మెవరిదో అది యిచ్చటికి వచ్చుటకుఁ గారణమేమి? (తలగడపై నున్న యుత్తరముందీసి) దిక్కుమాలిన రాజకార్య తంత్రము భార్యయొద్ద దిన్నగం బండుకొ ననైన నీయదుగదా? ఏమి? (జరూరని దీనిపైన వ్రాయబడి యున్నదే. (సీలు విప్పి చూచును.) మంచముమీఁదఁ గూలబడి) అల్లా అల్లా అల్లా హోఅక్బర్ అల్లాహో అక్బర్! ఈగుడిసెవ్రేటిముండ నాపరువు తీసివేసినదే. నన్ను మాయ చేసినదే. మా మొగలాయివంశ మునకుఁ ప్రేగులుదీసి కుక్కలకుఁ బెట్టించెదను. నాయెడల నింతవిశ్వాసఘాతుకురాలై ప్రఎర్తించిన యీ తుచ్చురాలి ప్రేగులను విశ్వాసవంతములైన నాకుక్కలు స్పృశించునా? నా కైజారును వ్యభిచార దోషమున మలిమసమైన యీముండ రక్తమున నపవిత్రము గావించె దనా? నేను దానిని జంపను. దీనిని సంతలోఁ బెట్టించి ఒక్కొక్క యవయవ మొక్కొక్కది నమునఁ గోయించి చిత్రవధఁ జేయించెదను. నేనిప్పడేమియు దెలియనటులే నటింతును. అది చేసిన దోషమును గూర్చి విమర్శింతును. చంపించుట యెంతసేపు? ఏనిముసమున నైనను తలారి చేయఁగలడు. ఆమోస కత్తెయైన ముండ యిటకు వచ్చుచున్నది. నేను జూడనట్టు నటింతును.

పన్నీటిబుడ్డితో వచ్చి కిన్నెత్ షాజహానును వెనుకప్రక్కనుండి కౌగిలించును.

షాజ:-(వెగటుపడి వెంటనే క్రమ్ముకొని) ప్యారీ బైఠీయే? (ఆమె కూరుచుండును) చూడు. వయసు ముదిరినవాని యుబలాటము. తాటాకు మంటవంటిది. రవంత యాలస్య మగునెడల నావాంఛ యంతటితో నశించును. ఇపుడు నీతో రవంత మాటలాడవలసియు న్నది. సరిగ బ్రత్యుత్తర మిచ్చెదవా? జడిసి యసత్య మాడుదువా?

కిన్నె- నా నోటివెంట యింత వఱకు సత్యమేకాని యసత్యమెన్నఁడు రాలేదు. నే నొకరిని జూచి భయపడుటకు నావలన నేమైన దోషమున్నదా? భగవంతుని యెడలఁ గూడ, నేను బుద్దిపూర్వకముగఁ దప్పజేసి యుండలేదు. నీ వెంత మాత్రము సందేహింపక, నీకుఁ దోచినదేదో యడుగుము.

షాజ:- తలాడ పైనున్న యీయుత్తర మెవరు తెచ్చిరి?

కిన్నె- నాక్రొత్తదాసి. ఆది కోటలోనికి వచ్చుచుండంగా, పహిలీ దర్వాజాయొద్ద నెందరో జనులు మూఁగియున్నారట. వారిలో నొక్కడు దానిచేతి కీలేఖ నిచ్చి పాదుషా సర్కారువారి క్రొత్త జనానాలో దాఖలుచేయుమని చెప్పెనట. అట్టుతెచ్చి నాచేతి కివ్వఁబోవఁగా నాభర్తతలాడపై నుంపుమని చెప్పితిని. అది అట్టు చేసినది. నేను మీతో యీ