పుట:SaakshiPartIII.djvu/16

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాక్షి సంఘ పునరుద్ధారణము

5

మీరందఱు విచ్చేసితిరి. చాలా సంతోషమైనది. క్రిందటిసారి సాక్షి సంఘము శివరాత్రియందు స్థాపింపఁబడినది. ఈసారి శివపుత్రరాత్రియందు స్థాపింపఁ బడినది.

నాయనలారా! ధర్మాన్నశాలలు, ధర్మవైద్యశాలలు, దేవాలయములు, గ్రంథాలయములు, సారస్వతసంఘములు, భజనమందిరములు మొదలగుపవిత్రసంస్థ లనేకములు మనకున్నవి. ఇట్టివానిని నింక స్థాపింప వలసివచ్చినప్పడు కాని, పురుద్దారణ మొనర్చవలసివచ్చినప్పడు కాని మన పెద్దలేదినములు పవిత్రములుగా గణించినారో యాదినములందే యాకార్యములు జరిగింపవలయును. మనకెన్ని యె పవిత్రదినములున్నవి. అవతారపురుషులు జన్మించినదినములు మనకుఁ బవిత్రదినములు, మన భారతమహావీరులు జన్మించినదినములు, మరణించిన దినములు, మనలో మతకర్తలు వేదాంతులు సంస్కర్తలు జన్మించినదినములు, మరణించిన దినములు మనకుఁ బవిత్రదినములు. ఇవికాక, దేవీనవరాత్రము లని, వినాయకనవరాత్రము లని, వసంతపూజాదినము లని యనేకములైన పవిత్రదినములు మాకున్నవి. ధర్మనిర్వహణమునకై జ్ఞానప్రదానమునకై యేర్పాటు కాబడుసంస్థల స్థాపనము, పునరుద్దారణము మొదలగు లోకోపకారకకార్యము లిట్టి పవిత్రదినములందే మన పెద్దలచే మనభారతదేశముచే, మనదేవతలచేఁ బావనములని యెంచఁబడిన యిట్టి మహాదినము లందే జరిగింపవలయును.

ఇరువదియవ శతాబ్దమందు జీవించియున్న మనకు-నాంగ్లేయభాషాజ్ఞాన మేకొలదియో సంపాదించినమనకు-కాల మనఁగా Sequence of Events వలన మనస్సులోఁ గలిగిన impression కంటె మరియేదియు కాదని యాంగ్లేయగ్రంథములు చెప్పచుండఁగా వినినమనకు నింకనుదర్శ దుర్దినమని, ఏకాదశి సుదినమని గూఢమైన మౌఢ్యముండనేలయని పైవారధిక్షేపింతురా? ఊఁ, అధిక్షేపింపనిండు. ఎందులకయిన సరే, యెవనినైనసరే, యుధిక్షేపింపకూరకుండిన దెవఁడు? పవిత్రదినములు లేనిజాతి ప్రపంచమందున్నదా? ఉండుట కవకాశ మున్నదా? మనమహ్మదీయసోదరులకు బక్రీత్, రమ్జాను, మొహరము మొదలగు పవిత్రములు లేవా? మన యాంగ్లేయసోదరులకు క్రిస్మసుపండుగలు, మేయుత్సవములు మొదలగునవి లేవా? ఇదికాక వారికిఁ బ్రత్యాదివారముకూడ బవిత్రదినమేకాదా? ఒకదినము మంచిది వేఱొకొకటి జబ్బేకానియెడల Good Friday కర్ధమున్నదా? దానిపవిత్రత యెఱిఁగియే దాని నట్టు పిలిచినారు. ఇది కాక వర్ణభేదము మిథ్య యని, వేదములు కృత్రిమము లని, జీవాత్మలెండమావులని, భగవంతునిగూర్చి విచారింపఁ దగదని బోధించి నబుద్దుఁడు సైతము పెద్దలుగతించిన దినములనుబవిత్రములుగాఁ జూచుకొనుమని బోధింప లేదా? అందఱుకూడ నీవిషయ మంగీకరించినదే అడగినప్పడు మాత్ర మొప్పుకొనుటకు గొంత జంకుచున్నారు. కాని మన కాభయమక్కఱ లేదు. పెద్దలు నడచిన త్రోవను నడుచుచున్నంతకాలము మనమెవ్వరికి భయపడవలసినపని లేదు.

మనపవిత్రదినములందే మన ధర్మసంస్థల సంబంధములగు నుత్సవములను జరిగించుకొనవలయును. ఆదినములు పావనము లగుటచే జనుల మనస్సులందొక మంచిమార్పు కలుగక తప్పదు. శివరాత్రిదినమునఁ జేయవలసిన పవిత్రవిధు లన్నియు యథావిధిగ జేయనివాఁడైనను జేయలేకుంటమని రవంతవంతకైనఁ బాల్పడక తీరఁడు. ప్రతిదినమును క్షురకర్మ మొనరించుకొనువాఁడైనను భీప్మైకాదశీదినమున గడ్డము తడిపించుకొనుటకుఁ