పుట:SaakshiPartIII.djvu/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఉత్తరరామచరితములోని చిత్రము సారస్వత ప్రపంచమందు జిత్రమై యున్నది. నాటకములలో నంతర్నాటకములున్నవి. ఇంద్రజాల ప్రదర్శనము లున్నవి. కాని తమచరి తమే చిత్రపటమున వ్రాయించి తామే చూచుకొని జనులు సంతోషించుటయో, ఏడ్చుటయో జరుగట మాత్ర మీనాటకమందు మాత్రమే యున్నది. ఉత్తరరామచరిత ముత్తరకాండలోని గాథతో సంబంధించినది. ఈకాండ వాల్మీకిరామాణమునఁ జేరలేదనియుం బ్రక్షిప్తమనియుఁ గొంతప్రతీతి యున్నది. కాని యుత్తరకాండకూడ వాల్మీకికృతమే యనియు నుత్తరకాండ కూడ రామాయణములో నొక్కభాగమేయనియు భవభూతి యభిప్రాయమైనట్టుత్తరరామ చరితమువలననే తెలియుచున్నది. అందుచే నుత్తరకాండలోని గాథను ప్రత్యేకముగ నాటక మును వ్రాయఁదలఁచిన భవభూతి, కథైక్యము కొఱకు పూర్వకాండలలోని కథ నతిసంగ్ర హముగాఁ బలికింపవలసివచ్చినది. కౌశికుఁడు రామునకు జృంభకాస్త్రము లిచ్చుట, శివధనుర్భంగము, సీతావినాహము, పరశురామ గర్వభంగము, మంధరావృత్తాంతము, వనవాసము, విరాధాదివధ, మాల్యవత్పర్వతనివాసము, వాయుపుత్రసందర్శనము, సుగ్రీవస ఖ్యము మొదలుగా గల రామకథ లంకలో జరిగిన యార్యాహుతాశనశుద్దివఱకుఁ బటములో లిఖింపఁబడెను. తరువాతఁ బట్టాభిషేకమునకు వచ్చిన బంధువులు వెళ్లగనే యుత్తరరామచ రిత్ర ప్రథమాంకకథ యారంభమైనది. ఇట్టీ క్రొత్తగాథను బ్రాంతగాథతో నాతం డదికినాఁడు. గ్రంథైక్యసిద్దియే భవభూతి యభిసంధి యైనను బటు మందుకొఱకు నిర్మింపఁబడినదని యనగూడదు. కావునఁ దండ్రి మిథిలాపురమునకు వెడలుటవలన బెంగగొన్న జానకీదేవి వేడుకకై యది చిత్రింపఁబడిదనది రామలక్మణులచే ననిపించినాఁడు.

లక్ష్మ- (ప్రవేశించి) ఆర్యులకు జమయగుఁగాక. మనము చెప్పిన ప్రకార మర్డునుఁడు మీ చరితము నీ పటముందుఁ జిత్రించి తెచ్చి నాడు. చూడఁదగును.

రామ:- వత్సా! వ్యాకులచిత్తమైయున్న దేనికి వినోదము కల్పించుమార్గము నీ వెఱుఁగుదువు.

భవభూతి యిట్టు చిత్రపట కారణమును సర్దుబాటుగ జెప్పినాఁడు. కాని యీ పటపరీక్షలో నేమి జరిగినదో యిఁకఁ జెప్పదును.

లక్మణుడు పటమును జూపుచున్నాఁడు.

లక్మ:- ఆర్యా! ఇది చూడఁదగిన పట్టు. ఇతఁడు భగవంతుఁడగు భార్గవుఁడు.

సీత:- (సంభ్రమముతో) నాకు వడకు పుట్టుచున్నది.

కల్యాణమైన పిదప జానకీరాము లయోధ్యకు సబంధుపరివారులైయేగుచుండ దారిలో నడ్డుకొనిన పరశురాముని వృత్తాంతమాతని విగ్రహదర్శనము జ్ఞప్తికి రాగసీతకు వడకుపుట్టిన దని యనుకొన వలయును. అంతేనా? అంతకంటెు గారణమేమైన నుండునా? ఉండదనుట నిస్సందేహము. చిత్రకారుఁ డొక్క పరశురాముని మాత్రమే చిత్రించి యూరకుండడు కదా? రాముఁడతని చేతిలో నున్న ధనస్సుతో పాటతనితేజముఁగూడ లాగుకొనిన సన్నివేశ మక్కడనే చిత్రింపబడియుండక తప్పదుకదా? శివధనున్బంగమే కాక పరశురామ గర్వభంగముఁ గూడ నొనర్చిన జగదేకవీరుడైన భర్త తన ప్రక్కనే యుండ నవిగ్రహ