పుట:SaakshiPartIII.djvu/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొు దటిది.

శవచింతామణీ గ్రంథాలయ కార్యదర్శియగు గొంగళి భుక్తసాకీన్ గొలాంత్రగారి యొుద్దనుండి

శ్రీశ్రీ రాజమాన్యరాజపూజితులగు సాక్షికి

అయ్యా! మీ సంఘము తిరుగ స్థాపింపబడినదని విని మిగుల నానందించు చున్నాము. మాపుస్తకాగారమున మీ సంపుటములలో మొదటిది మూడవది మాత్రమే యున్నవి. రెండు నాల్గు సంపుటములు మాకుచితముగాఁ బంపవేఁడు చున్నాము. మానిలయము మిగుల దరిద్రస్థితిలో నున్నది. దైనికమగు నాంధ్ర పత్రిక నా విశ్వదాత పంపుచున్నాఁడు. ఆయన కనేక నమస్కారములు. మాగ్రంథ నిలయమునకుఁ గొందఱుకవులు వారి వారి గ్రంథములను ధర్మముగాఁ బంపుచున్నారు. ఆకవులకు నమస్కరించుచున్నాము. మీ జంఘాలశాస్త్రి యుపన్యాసములు వినుభాగ్యము తిరుగ మాకు లభించినందులకు సంతస మగుచున్నది. కాని యుకందులకు గొంచెము వగచుచున్నాము.

1. జంఘాలశాస్త్రి నడుచు నడుమ నాంగ్లేయపదముల నుపయోగించుచున్నాఁడు. వాని కర్దము తెలియక చిక్కుపడు చున్నాము.

2. ఈయంశమునుగూర్చి తరువాతఁ జెప్పెద నని వాగ్దాన మొనర్చిన విషయము లెన్నియో గలవు. అవి యన్నియు నిప్పడు చెప్పఁగోరుచున్నాము.

3. మీలో కాలాచార్యులు, వాణీదాసకవియు నున్నారుకాదా? వారుగూడ తఱచుగా నుపన్యాసము లిచ్చిన బాగుగా నుండునని నామనవి.

4. మాయూర నొకవైద్యు డున్నాడు. ఆతడు మీయుపన్యాసము లన్నియు నప్పజెప్పఁగలడు. మీసంఘమునం దాతని సభ్యునిగాఁ జేర్చుకొనవలయును.

చిత్తగింపవలెను గొంగళిభుక్త కార్యదర్శి.

జంఘాలశాస్తి యిట్టు లేఖను బూర్తిచేసి దీనికిఁ బ్రత్యుత్తర మక్కఱలేదు కాదా యని నభవారి నడిగెను. అందఱున లేదనిరి.

జంఘాలశాస్త్రి రెండవ యుత్తరమును దీసి యిట్టు పలికెను.

సోదరులారా! ఇది రెండవయుత్తరము దీనిని జదివెదను.

కృష్ణాగోదావరీ మండలాంతర్గత సర్వాంధ్రకురకశాల సామాన్యకార్యదర్శి యొద్దనుండి -జంఘాలశాస్త్రిగారికి-

రామ్ రామ్,

ఏలోరులో స్థాపింపఁబడిన యీ సర్వక్షురక శాలాప్రధానకార్యాలయమునం దీసంఘసం బంధమైన పదునెనిమిదివార్షికోత్సవ మీనెల 27వ తేదిన జరుపుటకుఁ బెద్దలు నిశ్చయించి నారు. ఆంధ్రదేశము నందుండు క్షురక విద్యాపారీణుల కందఱ కాహ్వానములు పంపించుచు న్నాము. చిత్ర విచిత్రోపన్యాసము లీయంగల మంగలి మహావక్తలెందఱో రాఁగలరు. క్షురకవి