Jump to content

పుట:SaakshiPartIII.djvu/118

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పవిత్రమైనది. మనస్సులలో సాష్ట్రాంగపడుడు కన్నుల కద్దుకొనుడు -కృష్ణా! ఆపదుద్దారకా! సంసారసాగరతారకా! యని యా నేలపైఁ బడితిని. ఒకవిధమగుకలఁతనిద్ర కలిగెను. దానిలో నొకస్వప్నము వచ్చినది. అది వినుడు.

రెండుకొండ లెదురుగఁ గనబడినవి కాని నడుమనున్న కోనలో నొక చక్కని యాశ్రమమున్నది. అచ్చటికిఁ బోయి పరిశీలించితిని. దానిలో నొక్క రావిచె ట్టున్నది. ఆచెట్టు భూలోకమందలి చెట్టవలె మూలము నొద్దనే మున్నదో పరీక్షింతు మని తలయెత్తగ జెప్పరాని, చూడరాని, తలఁపరాని వెలుఁగుచేఁ గన్నులు మనస్సుకూడ జీకట్లు పడినవి. పైకిఁజాడలేక చలువలు వెదచల్లుచున్న యాకులవంక జూచితిని. ఒక యాకు తేజస్వంతమై యున్నది. ఒకటి నల్లగ నున్నది. ఒకటి తెల్లగ నున్నది. ఒకటి శ్రవణమనోహరస్వరమయమై యున్నది. ఈ యాకుల క్రింద నొక మహావ్యక్తి యాసీనుఁడై యుండెను.

ఈతఁడు కూరుచుండునప్పడే నాలుగడుగులకంటె నెత్తుకలవాఁడై యున్నట్టు కనఁబడినది. నల్లని శరీరకాంతికలిగి పచ్చని జటలుకలిగి యాతండు ప్రకాశించుచుండెను. ప్రక్కనొకకఱ్ఱ భూమిపైనున్నది. అప్పడు 'ప్రాంశుపయోద నీలతనుభాసితు నుజ్జ్వలదండ ధారు' అనుపద్యము జ్ఞప్తికివచ్చినది. అదిగాక యాచెట్టవైఖరి జూడ “ఊర్ధ్వ మూలమధశ్శాఖ మశ్వత్తం ప్రాహురవ్యయమ్' అన్న శ్లోకము జ్ఞప్తికి వచ్చెను. అందుచే నీతఁడు వ్యాసమహ రియై యుండునని యనుకొంటసిని. అదిగాక యా యశ్వత్థవృక్ష వర్ధములైన వేదములనొద్ద నీతడు కూరుచుండి యుండెను. ఈతడు తప్పక వేదవ్యాసుడని నిశ్చయించి యెదుటికిఁ బోయి సాష్ట్రాంగపడి యిట్టంటిని.

మహర్షి శేఖరా? మీరు విభాగించిన వేదముల నెవ్వరు నిప్పడు పఠించుట లేదు. స్పృశించుట లేదు. అంటరానితనము చెప్పరానితనము నీవేదములకు మనవా రంట గట్టివారు అవి యందుచే పై ఖండములవారి యధీనములయ్యెను. మీరు రచియించిన భగవద్గీతకూడ మొన్నమొన్నటి వఱకు బుట్టదాఖలై యుండెను. అది మిక్కిలి యుద్గ్రంథ మని పాశ్చాత్యులు స్తుతించుట చేత వారిమాటల నాధారము చేసికొని యిప్పడిప్పడే గ్రంథఘనత కచ్చెరు వొందుచున్నారు.

మహర్షిచంద్రమా! కమించునెడల నొక్క సంగతి యడిగెదను. భగవద్గీతకు బుద్దిమం తులగు పండితు లందఱు వివిధములగా వ్యాఖ్యానములు చేయుచున్నారేల? శంకరాచార్యుల వలె రామానుజులు చేసినారా? వారివలెమథ్వాచార్యులు చేసినారా? యుద్ధకర్మము చేయుటకే యిప్పటివా రనుచున్నారు. మఱియొకరు భగవద్గీతను మీరు రచియింపనే లేదని తుండు తుపాకి నెగుర గొట్టుచున్నారు. మీరను నొక వ్యక్తియే లేదని కొంద ఆనుచున్నారు. కృష్ణుఁ డన్న యాతఁడు దశావతారములలోనివాఁడు కాఁడని మఱికొందఱనుచున్నారు. ఈచచ్చు వాదములకేమి కాని యిన్నివిధములైన వ్యాఖ్యానములు బుట్టుటకు హేతువేది? కృష్ణభగవానుఁ డిన్ని యర్ధములగునట్టు చెప్పనా? కాక యాయన యభిప్రాయమును మీరు సరిగాష దెలిసికొన లేక యిట్లు వ్రాసితిరా? కాక యన్ని విధములగు నర్ధములకు లోపము మీ వ్రాఁతలోనిదా? నాకుఁ దెలియక యడుగుచున్నాను దేవా! క్షమింపుఁడు.

మీవేదాంతసూత్రములకు మతత్రయవ్యాఖ్య లున్నవి. ద్వైతశ్రుతులు నద్వైతశ్రు