Jump to content

పుట:SaakshiPartIII.djvu/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నాయనలారా! కురుక్షేత్రమునకు నాతో దీసికొనిపోయిన మిమ్ముఁ బ్రసంగవశమున హస్తినాపురమునకుఁ దీసికొని పోయితిని. నాయం దనుగ్రహించి తిరుగ గురుక్షేత్రమునకు దయచేయుదురుగాక. ఉర్డుకవి వ్రాసిన వ్రాఁతలోని యర్ధనును దెలిసికొంటిరికాదా? వారికిందెల్లరాతి పలకలు పాలసున్నము బంగరు రేకులు విలువగలమణులు ఫలాహారములు షర్బతులు లవలవ వఱకు ముదురనినవ నవయువతీమణుల మొగములే స్వర్గమైననగు గాక, వైకుంఠమైన నగుగాక, పరమపదమైన నగుగాక! కాని మనకు మాత్ర మీకురుక్షేత్రమే స్వర్గము. ఇచ్చటి కంకరరాలే రత్నరాసులు. ఇచ్చటి బుడ్డమేడిచెట్టులే కల్పవృక్షములు. ఇచ్చటిమట్టియే బంగారము. ఇచ్చటి యొండమావుల వెల్లువలే యాకాశ గంగాప్రవాహములు. ఎందుచేత? లోకములో నున్న అన్నిబంగారు గనులకంటెను నన్ని రత్నాలగనులకంటేును నత్యధికమైన విలువ గల భగవద్గీత యిచ్చట నుద్బుద్ద మగుటచేత. నాయనలారా? ఆగ్రంథముచే మనము తరింతుము. అంతేకాని కాసులగోనె నెత్తిపైబెట్టుకొని వైకుంఠసోపాన మెక్కినవాఁ డెవఁడు? ధర్మరాజుతోఁ బైలోకమునకు వచ్చినది శునకముకాని ద్రౌపది కాదే. పోనిండు. ద్రౌపది యుమ్మడియాస్తి కావున నాతనితోఁ బోకపోవచ్చును గాని యెవరికిఁ దగిన సొంతసరకును వారు జాగ్రత్తపెట్టుకొనియే యున్నారు కాని, యుపేక్షింప లేదే. ధర్మరాజుమాత్రము తత్త్వవాక్యములలో శ్రుతపాండిత్యము సంపాదించినవాఁడుకాని ప్రక్క దాపు లేకుండ బండ్రెండుమాసములు గడపఁగలిగిన యెడలి స్తిమితత గలవాఁడా?

భగవద్గీతను లోకగురునిచే నుపదేశ మందిన నరునకుఁ బైలోకమేల రాలేదో యడుగ రేమి? అర్జునునకు జ్ఞానసంపాదన కధికారము లేదు. ఆతడు గుంటయోనమాల యొద్ద నున్నవాఁడే కాని యంతకుఁబైని బోయినవాఁడు కాఁడు. సోదరులను గురువులను బంధువు లను జంపుట కిష్టపడక యుద్దము మానుకొని యేడ్చుచుఁ గూరుచుండిన పార్డునకు “శత్రువు లందఱు నాచేతనే చచ్చినారు. నీ పూరక ధనువు పట్టుకొని నిమిత్తమాత్రుడనై నిలుచుండి కత్రియధర్మమును నిర్వహించుకొను" మని చెప్పిన కృష్ణునిబోధన యంతమా త్రమే నరునికి బోధమైనది కాని మిగిలినదంతయు నతని యాచరణములోనికి రానిదే యయ్యెను. సర్వకర్మములుకూడ జ్ఞానమందుఁ బరిసమాప్తినొందవలసిన దని పురుషోత్తము లుకూడ చేసిన బోధ మతని యంతరంగమున నెక్కినదా? అట్లాచరించినాడా! సర్వజ్ఞానస ముదయము కూడ యుద్దకర్మమునందుఁ బరిసమాప్తి యైన ట్లయినది.

ఇక ధర్మరాజమాట-అతనికి రాజ్యమందున్న తృష్ణ యెవ్వనికిని లేదు. అతనికి జూదమం దున్నప్రీతి దేనియందును లేదు. ఆతని గడుసుమాటలు, కల్లయేడ్పులు, బొల్లినైచ్యములు, ముఖస్తుతులు; సమయోజిత ప్రవర్తనమలు మఱి యింక నెన్నియో యతని నరకార్హుడునిఁ జేసినవి. కాని యాసపడి యాసపడి యేడ్చియేడ్చి తెచ్చుకొన్న రాజ్యములో సర్వశూన్యత తక్క పెద్దవల్లకాడుతక్క నిత్యశ్రాద్దాలుతక్క మఱికి యేదియు లేకపోవుటవలనను బుద్దిపూర్వకముగ నున్నను జంపించుటచేతఁ గలిగిన ఘోరపశ్చాత్తాపము వలనను నరకార్హత కొంత తప్పినది. అందుపై భీష్మునిధర్మబోధములు సమయోచితముగఁ గలుగుట చేత నాతని మనస్సునకు శాంతి కలుగఁ జేసినవి. అందుచేత నాతనికిఁ గొంతకాలమైన స్వర్గలోకవాసము కలిగినది. ఇట్టుగా ధర్మరాజు జ్ఞానమువలన నుత్తమలోకార్హు డయ్యెను.

అట్టి జ్ఞానబోధ మీ కురుక్షేత్రమున జరిగినది. అందుచేత నీ భూమి మిగుల