పుట:SaakshiPartIII.djvu/112

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

న్నది. అయినను వారిదోషమువలన వారట్లుకాలేదు. మనదోషము వలన నైరి. ఎన్ని వందల సంవత్సరముల క్రిందటనోయైరి. అట్టనిర్దోషులను- అది గాక మనదోషముల వలననే యట్లు కావలసి వచ్చినవారిని సంఘములోనికి విద్యాబుద్దులు చెప్పించుచుఁ దీసికొనుట మంచిది. ఎప్పడో జరిగిన యీతప్పను గూర్చి యేల?

ఇప్ప డిట్టి తలక్రిందు పెండ్లిండ్లు ఎన్ని యగుచుండుట లేదు? ప్రత్యకముగ బాహా టముగ బ్రచ్చన్నముగ నరచాటుగ నెన్ని జరుగుటలేదు? అందువలన మన సంఘమం దెన్ని సంతానములు కలుగుటలేదు. దినమున కట్టి సంతానములు భారతదేశమందు వేలకొలదిఁ గలుగుచుండుట నిస్సందేహము. అవి మన మెఱుఁగుదుము. ఎఱుఁగము. ఎఱిఁగియు నెఱుఁగక యున్నాము. ఎఱుంగకుండ నెఱిగియున్నాము. అట్టివారిని మన సంఘమందుఁ బ్రాణప్రదముగ నుంచుకొను చుండుట లేదా? వారి సంతానములను కర్ణులైన ప్పడు-ఎన్నివేల సంవత్సరముల క్రిందటనో మన దోషమువలననే బహిష్కృతులైన వారిని సంఘమున కేల తీసికొనఁగూడదు? సంఘములో నింత దొంగతనము -నింతపాపము- నింత క్రుళ్లుదాఁచుకొని దాఁచుకొని సహించు చున్నప్పడు నిర్దోషులైన వారి నేల తీసికోగూడదు?

భారతీయ పూర్వాచారము లన్నియు నశించినవి. వానివలెనే యీ యస్పృశ్యత కూడ నశింపఁ దగినది. అది మనకు బాధ నిచ్చుట లేదు. కావున దీని నింక యల్లై యుంచినాము. ఇది మరింత పాపము.

మీకు మతము పోవునప్పటికి బ్రదుకు పోవునప్పటికి మోక్షము పోవునప్పటికి రామానుజులు గోపుర మెక్కి తిరుమంత్ర ముపదేశించినట్టు మీరు వారి నుద్దరించుట మహాకార్యము. మీరట్టు చేయలేరా? ఇప్పడే కాకపోయిన మరి యింక కొలఁది కాలమునకైన వారె మన స్థాన మాక్రమింతురు. ఇప్పడే యట్టు చేసి మాట దక్కించుకొనునటు మంచిది.

ఓమ్ శాంతి శ్శాంతి శ్శాంతిః.