పుట:SaakshiPartIII.djvu/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దని యిచ్చటికిఁ దెచ్చినారు. నే నింటికిఁ బోవుదును. నీవు నాకుఁ బ్రతినిధిగ గదిలోఁ గూర్చుండంగలవా యని యడిగెను.

నే నూరకుండు సరికి Faithless fool అని నన్నుఁ దిట్టి తానే గదిలోనికి పోయెను.

ఇతడు తప్పదారిని బడకుండ కొంతసేపటి నుండి యుపన్యసించుచున్నాడు. పిచ్చి చాలభాగము కుదిరినది. అప్పడప్పడు రవంత కనబడుచున్నది.

ఇతని యుపన్యాసమునుగూర్చి నే నిప్ప డేమియుఁ జెప్పను. ఆలస్య మైనది. క్షమింపవలయును.

ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః.