పుట:SaakshiPartIII.djvu/100

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఫ్రీ పురుషభేద మెరుగని మూఢశిరోమణిని సార్వభౌమునిఁ జేసినారు. జ్ఞానశూన్యు లగువారికి బిరుదము లిచ్చి ప్రాచీనమహావ్యక్తులపరువును బరశురామప్రీతి యొనర్తురా యని వంగదేశ పరిషత్తువారికి నేను తెలియఁ బరుపఁగా

ఈపనికిమాలిన గొడవ నా కెందులయ్యా నే నడిగిన పురుష ప్రయత్నమునుగూర్చి చెప్పమని యంటిని.

సరే-కాచికో! నీవు ప్రయత్నించి, నీయూపిరి తిత్తులలోని కన్సుబుస్సుల నాంపగ లవా? హృదయకోశమునందలి తాళప్రసారమును గట్టివేయఁగలవా? నీవు పుట్టితివిగదా -నీపుట్టుకకు నీ వేమి ప్రయత్న మొనర్చితివో యెఱుఁగుదువా? నీమరణమున కెట్టి ప్రయత్నము చేయదలచియున్నావో? ఎవ్వఁడైన గష్టమును కోరుకొనునా? దారిద్ర్య మును కోరుకొనునా? చెప్పంగలవా? చావు కోరుకొనునా? జీవునకు ప్రధానవాంఛ యేది? స్వసౌఖ్యము. అప్రయత్నముగా భూమిపై బడినది మొద లప్రయత్నముగాఁ గాటలో బడువఱకు సర్వస్థల సర్వకాల సర్వావస్థలయందుఁ జేయు ప్రయత్న మంతయు స్వసౌఖ్యము నకే కాదా? చావు దప్పించు కొనవలయునని పుట్టినది మొదలు ప్రయత్నముఁజేయు జీవుఁడు చావుకొఱకే ప్రయత్నించు చున్నాడు కాదా? చావువంకకే పరుగెత్తుచున్నాఁడు కాదా? ఇంకను బ్రయత్నమని, ఫలమని యేల వెఱ్ఱిపడుదువు? ఇంతకాలమునుండి స్వరాజ్యసంపాద నప్రయత్నము జరుగుచున్నది కదా! ఇప్పటి కేమైనది. మన లెక్క యేమి. భగవానుఁ డైన శ్రీకృష్ణుఁడు కౌరవసభకు సంధి కొఱకుఁబోయి యేమి చేయఁగలిగినాఁడు?

"అయ్యా! చదువుకొననివాఁడు వాదించునట్టు వాదించుచున్నావు. నేను జెప్పిన దే మనగా, ఫల మున్నప్పడు ప్రయత్నముండి తీరవలయును. ప్రయత్న మున్నచోట నెల్లప్పడు ఫలము లేకపోవచ్చును. ఎందుచేత ననగా నెంత పురుషప్రయత్న మున్నను దైవసాహాయ్యము లేనియెడల నాప్రయత్నము ఫలింపదు. పురుషప్రయత్నము పదునాల్గు పాళ్లు, దైవప్రయత్నము రెండుపాళ్లు' అని నేనంటిని.

ఈమాత్రపుబుద్ది యీమాత్రపు జదువు, యీమాత్రపు వాదన శక్తి నాకు నున్నవి. సాక్షి సంఘములోని ప్రథానవావదూకుడ నని కన్నులు నెత్తి మీదికి వచ్చినవి. జాగ్రత్త! ఇక్కడ నే ననుదినము నంతరిక్షమున నవతరించిన యాదిత్యులసభలో నధ్యకుడనై యుపన్యసించుచున్నాను. త్రినేత్రి, సహస్రనేత్రాదులు ప్రత్యకములైన పంచభూతములతోఁ గిక్కురుమనకుండ వినుచున్నారు. నీయుపపాదన మేదో నాకుఁ దెలియకపోలేదు. నాపూర్వ పకవైఖరి నెఱుఁగకుండ మాటలాడుచున్నావు. మొదట నీ వేమంటివి? ఫలమునకుఁ బురుషప్రయత్నము కావలయు నని యంటవి. ఇప్పడే మనుచున్నావు? పురుష ప్రయత్న మునకు దైవప్రయత్నము తోడుపడవలయు ననుచున్నావు. ఎంతపురుషప్రయత్నమున్నను దైవ ప్రయత్నము లేకుండ ఫలము లేదనుచున్నావు. అనంగా దైవప్రయత్నమునకుఁ బదునాల్గు పాళ్లుపురుష ప్రయత్నము బోటుగాఁ గ్రింద నున్నఁగాని ఫలము లేదని నీయభిప్రాయము. గౌరవించినయెడలఁ బూర్తిగాఁ బౌరుషము నైన గౌరవింపుము. లేదేని దైవమునైన గౌరవిం పుము. అట్టు చేయక రెంటిని దగులఁబెట్టుచున్నావు. పురుషప్రయత్నమే లేకుండ గేవలము దైవికము లున్నవా, లేవా? వీథివెంటఁ బోవుచున్న యొకమునలిదానిపై బిడుగుపడినది. ఇది కేవలము దైవిక మందువా? పదునాల్గుపాళ్లు పౌరుషముతో మేళవించిన దైవికమందువా?