పుట:Rubayat.pdf/56

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

98

కర్మమను నీపుస్తకములో
మర్మమున వ్రాసేటి వ్రాఁతను
ధర్మదేవత చేరి యించుక

మార్చినను సరియే

యోర్మితక్కువయైన దానిని
గూర్మిమీఱఁగఁ జెఱపి వేయుచు
ధర్మముం గట్టికొనినన్ సరె

యింత సుఖపడుదున్.


99


ప్రేయసీ! యిది దుఃఖపూర్ణము
మాయచే నావృతము లోకము
మాయ చేయుచు సృష్టి మనచే

తులను బట్టితిమా

చేయమే హృదయంగమంబగు
చాయ దీనిని తారుమారుగ
హేయమగు సర్వమును బాఱగఁ

ద్రోసి స్వేచ్ఛగను.

50
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/56&oldid=322272" నుండి వెలికితీశారు