పుట:Rubayat.pdf/53

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

92

కలిసిపోయియు మంటిలోపల
నిలిచియుండఁగ నందు ద్రాక్షలు
మొలచి తీవలఁ బర్వఁజేయఁగ

నవియుఁ బ్రాకుచును

నెలమి భక్తులు నట్లుపోవఁగ
కలయఁగాళ్ళను బెనగి పట్టుచు
తెలివినిచ్చును గాక, వారి వి

చారమును ద్రోలి.


93



నేను బశ్చాత్తాప మందుచుఁ
బూని ప్రార్థింపంగఁ దొడఁగితిఁ
గానఁబడె స్వర్గం బటంచును

నూహ చేసితిని

కాని యీమధురసముఁ గొంచె
మానఁగానే భక్తియంతయు
కానఁబడకుండంగఁ బోయె న

దేమి చిత్రమహో!

37

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/53&oldid=322268" నుండి వెలికితీశారు