పుట:Rubayat.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

90

వాదముల నవి యిట్లు సలపఁగ
ఖేదమున 'రమజాను' పోయెను
మోదమున 'షవ్వాలు' వచ్చెను

ప్రీతి నింపుచును

మీాఁద వాహకు లపుడు వీఁపుల
మీఁద కావడిఁ జేర్చికుండల
నాదటను వే మోసికొంచును

నడువఁ జొచ్చిరటన్,


91


ఇంక నెన్నోనాళ్ళు బ్రదికే
దింక లేదుసుమీ యిహంబున
శంకచేయక మధురసంబును

పోయుమీ నాకున్,

క్రుంకిపోయినపిదప నల్గురు
నింక విడువకయుండి, ద్రాక్షల
వంకఁగొని పోవుచును నచ్చట

పూడ్చియుంచు మయా.
46
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/52&oldid=322267" నుండి వెలికితీశారు