పుట:Rubayat.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

86

సాదు వొక ఘటమంతరూపసి
కాదటంచును నలుగు రనఁగాఁ
జీదరించుచు నిట్లు సాహస

మొప్పఁ దాఁ బలికెన్,

“నాదురూపముఁ జూచినవ్వెద
రేదో తప్పునుచేసె కుమ్మరి,
కాదు, ననుజేయంగఁ జేయియు

వడఁకెఁ గాఁబోలు.”


87


అంత లొడలొడ మంచు మఱియొక
వింతకుండయుఁ బలికె నిట్టులు
ఎంతో తెలిసినదానివలె మొగ

మెఱ్ఱ చేయుచును

"సంతయేమిది, కుండలందరు
వింతగా కుమ్మరి యటందురు
ఇంత తెలుపుఁడు కుండలెవ్వియొ

కుమ్మరియు నెవఁడో.”
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/50&oldid=322265" నుండి వెలికితీశారు