పుట:Rubayat.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పరిచయము.


ఈపద్యకావ్యము పురాతన పారసీక కవియైన ఉమార్ ఖయ్యామ్ అనే సుప్రసిద్ధ కవివ్రాసిన పద్యములకు తెనుగు. ఈ పద్యములు అనేక భాషలలోనికి పరివర్తితము లైనవి. మనవారుకూడా కొన్ని కొన్ని పద్యముల నాంధ్రీకరించి ప్రకటించినారు. ఉమార్ ఖయ్యామ్ వాసినవని వాడుకలో ఉన్న పద్యము లనేకములున్నవి. వానిలోని 101 పద్యములకు ఫిట్జ్‌గెరాల్డు అనుకవి ఇంగ్లీషు పద్యములను వ్రాసినాడు. ఆయన అనువాదముమిక్కిలి ప్రసిద్ధికెక్కినది; కాని, ఆయన పారసీకకవి యభిప్రాయమును కొంతవరకు తన భాషాసౌష్టవమున కనుగుణముగ మార్చి కూర్చినాడు.

ఈ చిన్న పుస్తకములోని షట్పదులు ఫిట్జ్‌గెరాల్డు తీసుకొన్న పద్యములకే అనువాదము; కాని, పారసీకకవి యభిప్రాయము

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/5&oldid=320204" నుండి వెలికితీశారు