పుట:Rubayat.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

84


"ఉత్తనేనా నన్ను జేయఁగ
మెత్తనైన బంకమట్టిని
మెత్తి యీరూపంబు నిచ్చెను

కుంభకారుండు?

ఎత్తివేసిన బద్దలౌదును
ఉత్తమన్నై మఁటఁగలసెద
నిత్తెఱఁగె మనయందఱి " నని

యొక్క కుండయనెన్.


85



ఎవ్వడైనను కడుపునిండఁగఁ
బువ్వఁదాఁ దిన్నట్టి పాత్రను
రవ్వచేయుచు విరుగఁగొట్టునె

మిగులఁ గోపమునన్

ఎవ్వఁడీ తను వింతసొంపుగ
పువ్వువలె నిర్మించె నాతఁడు
నొవ్వఁ జేయుచుఁ బాడుచేయునె "

అనియె మఱియొకటి.

43

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/49&oldid=322263" నుండి వెలికితీశారు