పుట:Rubayat.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

82

అంత సాయంకాల మయ్యెను
చింత నాఁకలి యాఁకలోయని
వింతగా “రమజాను” పోయెను,

అంతటను నేను

కొంతసేపొక కుంభకారుని
పొంత మసలితి; నచట దొంతులు
దొంతులుగ నెన్నెన్నొ కుండలు

కూడి పడియుండెన్.


83



ఎన్నో రకముల కుండలుండెను
చిన్నవియు మఱికొన్ని పెద్దవి
కొన్ని కోలవి కొన్ని గుండ్రని

వుండె నాయింట

కొన్నిటికి మాటలును వచ్చును
కొన్ని వినఁగల్గినవి, కాని
తిన్నగా విని యూరకుండఁగ

నూహ మదిచేసెన్.
42
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/48&oldid=322260" నుండి వెలికితీశారు