పుట:Rubayat.pdf/47

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

80

పోవవలె నీదారి నందువు
త్రోవలో వలఁబఱచి యుంతువు
త్రావినను మఱియేమి చేసినఁ

గోప పడియెదవు

నీవె నాచుట్టునను వ్యసనము
లావృతంబుగఁ జేసి, నేనును
త్రోవఁదప్పిన పాపివంచును

దలఁచె దిదియేమి?



81



నాకు స్వాతంత్య్ర౦బు నీయక
నీ కరంబునఁ గర్మసూత్రము
వీకఁ బట్టుచు నన్ను ద్రిప్పుచు

నుండఁగా నీవు

నాకుఁ బుణ్యము పాపమంచును
సాఁకులను గల్పింపఁ బాడియె
యేకరణి నను గాచెదవొ మఱి

నీదె భారమయా.

41

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/47&oldid=322254" నుండి వెలికితీశారు