పుట:Rubayat.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

78

జడపదార్థముతోడఁ జేసిన
యొడలిలో నొక యంతరాత్మను
వెడలఁజేయఁగ వలెనె? యదియును

కొన్ని సౌఖ్యములన్

విడువవలెనే కూడదనుచును
నుడువఁగాఁ బడినట్టి వానిని?
విడుపకున్నను శిక్షలఁటవె? యి

వేమి చోద్యములో!


79



మట్టిదేహము నప్పునిచ్చి
గట్టి బంగారంపు భక్తిని
గొట్టవలెనని తలఁచుచుందు వ

హె గడుసుదనము!

అట్టి దెప్పుడు నప్పునిచ్చితి
వట్టివ్యాజ్యం బిప్పు డేఁటికి
ఎట్టు లొప్పుకొనంగ దానిని

వింత యయ్యెడును.
40
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/46&oldid=322251" నుండి వెలికితీశారు