పుట:Rubayat.pdf/44

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

74

నేటి వెఱ్ఱియు నిన్నఁబుట్టెను
పాటిగా ఱేపటను వచ్చెడి
యోటమియు మౌనమును విజయము

నాఁటనే పుట్టెన్

పాటిసేయక త్రాగురా,నీ
వేటికో, మఱియెచటి నుండియొ
యేటికో, మఱి యెచ్చటికొ తెలి

యంగఁ జాలవురా.



75


జగము ప్రారంభించినప్పుడే
సుగతియో దుర్గతియొ నిర్ణయ
మగణితంబుగ నున్నయది య

ట్లుండఁగా నిపుడు

పొగులనేటికి తాగుబోతని
యిగిలఁ జేయఁగనేల పండ్లను
తగిన రీతిని బోయెదను నా

జోలి తలపకుము.
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/44&oldid=322249" నుండి వెలికితీశారు