పుట:Rubayat.pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

64

వెడలిరే కోటానకోటులు
పుడమి వీడుచు నిరులు క్రమ్మెడు
నడవి మార్గముఁబట్టి యొకఁడును

దిరిగి రాఁడేమీ?

అడిగి దారిని తెలియఁగా సరి
పడదు; మనమును దానిఁ గనుఁగొన
నడచి పోవఁగవలయు వేఱొక

దిక్కులేదు కదా!


64


ఎవ్వరో విద్వాంసులంట
ఎవ్వరో యోగీశ్వరులునఁట
ఎవ్వరో తెలిసికొని వచ్చిరఁ

టంట యీకతలు

ఎవ్వరయ్యా నమ్ముతా రవి
పవ్వళింపఁగఁ గలను గాంచిన
వివ్విధంబునఁ దెలిపి వారుసు

బవ్వళించారు.

33

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/39&oldid=322242" నుండి వెలికితీశారు