పుట:Rubayat.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

62

అర రె! జీవామృతము విడిచియుఁ
బరసుఖామృతమనుచు నెన్నటి
కొఱకో గుడ్లను మిటకరించుచు

వేచియుందునొకో!

ధరను నేఁ గల యంతకాలము
సరససుఖముల ననుభవించెదఁ
దిరిగి మంటను గలియ నేమవు

నెవరి కేమెఱుక?


63


నరకమున యమబాధలంట
సరససుఖమఁట స్వర్గ మందున
నరయఁజాలని దెల్ల బూటక

మొకటె సత్యమగున్

నరుల కీజీవంబు గ్రుక్కెడు
నరుదుకాదు గుటుక్కుమనుఁ జుమి
విడియఁ బాఱిన పువ్వు మఱలను

మొగ్గ యెట్టు లగున్

32
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/38&oldid=322220" నుండి వెలికితీశారు