పుట:Rubayat.pdf/29

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



44

ఓసి యాత్మా! యేమె యింతటి
గాసి? యయ్యొ! పవిత్రురాలవు
వాసిగా నాక సమునం దిరు

గాడఁ గలవుగదా.

పాసియుండఁగ నిచ్చగింపవు
గాసిపడే దీమంటి కొంపను
వాసమొనరింపంగ నీకును

లజ్జకాాాదటవే,


45


భూమియిది నశ్వరము, దీన మ
కాముచేసియు నాత్మసుల్తాన్
గీముగాఁగ గుడార మెత్తె శ

రీరమును దీనిన్
.

కామితార్ధము తీరినంత మ
కాము నెత్తుచు లేచు పాదుస
నేమమున మఱియొకని కియ్యది

వాసమగుచుండున్.

23

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/29&oldid=322108" నుండి వెలికితీశారు