పుట:Rubayat.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

71

అనెడు మృణ్మయపాత్ర యియ్యది
వినుచుఁ దనచెలి తీయమాటలఁ
గనుచు సౌఖ్యము, గ్రోలి మధువును

దిరిగె నొకయపుడు.

చనవుతో నిపు డేను ముద్దులు
గొనిన యిది పూర్వమున నెంతటి
యనువుతో ముద్దులను నిచ్చెనొ

మద్దులంగొనెనో.


71


మట్టిపాత్ర యిదేమి ముద్దు ల
వెట్టినని సంశయమువలవదు
నెట్ట దారినిపోవు కుమ్మరి

నొకనిఁ జూచితిని.

గట్టిగా మర్దించెఁ బచ్చి
మట్టి బట్టి యతండు, "నంత
గట్టిగాఁ గొట్టకుమి యన్నా”

యనుచు నదిపలికెన్.

19

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/25&oldid=321996" నుండి వెలికితీశారు