పుట:Rubayat.pdf/24

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

34

తెర వెనుక నాలోని నిన్ను
నరయ నీ చీఁకటిని దీపము.
దొరకునని చేయెత్తి వెదకితి

దొరకదయ్యెనది.

అరయుచుండగ నెచటినుండియొ
"కరము నీలోనున్న నేను
అరయఁగన్నులు లేనివాఁడ” న

టంచు వినవచ్చెన్.


35


అప్పుడీ మృత్పాత్రఁ బెదవికి
చప్పునను జేరిచియు నడిగితి
"చెప్పుమా యీజీవమర్మ" మ

టంచు వేడుకను.

విప్పి పెదవుల నదియుఁ దెలిపెను
“తప్పిపోయినఁ బోవు జీవము
లొప్పియుండఁగ మధురసంబును

గ్రోలి సుఖపడుమీ .”
18
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/24&oldid=321992" నుండి వెలికితీశారు