పుట:Rubayat.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



30

ఇందులోనికి వత్తుమఁట, యది
యెందుకో యొక్కింత తెెలియదు
ఎందునుండియు యంతకంటెను

అసలె తెలియదుగా,

ఎందులకో యిటనుండి, యింతయు
సందియముగద; నీటిఁబోలెను
ఎందొ పరుగిడి గాలిపలె నెటొ

యెగిరి పోయెదము.


31


భూమిమధ్యను నేమియున్నదొ
యేమిగలదొ శనైశ్వర గ్రహ
ధామమం; దీ రెంటి మధ్యను

గల్గువింతలను.

నేమమున నేఁ దెలిసికొంటిని
ఆ ముడుల నే నెల్ల విప్పితి
నేమిచిత్రమొ కర్మబంధ మె

విడకయున్న యది.

16
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/22&oldid=321989" నుండి వెలికితీశారు