పుట:Rubayat.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

26

ఎంతో జ్ఞానుల మనుచు నిక్కుచు
వింతవాదముఁ జేసినా రా
వంత తేలిసిరె యిహపరంబుల

గుట్టు నెవగైనక్.

ఎంతవా రీఋషులు యోగులు
వింతమాట లటంచుఁ గేలియు
నంతలోనే యందఱికిఁ బలె

నోటమన్నెకదా.


27


చిన్ననాఁటను పోయి యెంతో
విన్నవాఁడను పెద్ద శాస్త్రము
లెన్నొ సిద్ధాంతంబు లనియెడు

రిత్తమాటలను,

విన్నవా రెవరైన లేరు
కన్నవారును మొదలె లేరు
తిన్నఁగా మన బయలుదేరిన

తావు చేరెదము.
14
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/20&oldid=320607" నుండి వెలికితీశారు