పుట:Rubayat.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

22

నాకుఁ గూర్చెడు మిత్రులెందఱొ
ప్రాకిపోయిరి మెల్లమెల్లఁగ
వీఁక మృత్యువుముందు వారలు

నమ్రులైనారు.

నాకు వారికి మివులస్నేహము
కాకయేమయ్యె నొకటో రెం
డో కదా గ్లాసులను త్రాగియు

వెడలియున్నారు.


23


విడిచి యీగదిలోన మనలను
వెడలిపోయిరి వారు సొబగున
నొడలు సింగారించుకొని వా

సంతికయు వచ్చె౯.

అడరనేటికి మనము కూడా
నడువవలె భూశయ్యక్రిందికి
అడఁగెదము శయ్యవలె మనమును

నెవ్వరెవ్వరికో!
12
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/18&oldid=320604" నుండి వెలికితీశారు