పుట:Rubayat.pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

20

చిగురులెత్తెను మొలకయిది ప
చ్చగను నది యొడ్డునను నొహో
చిగురు మోవియదేదో యిటఁ బ్రస

వింపఁ జోలుఁ జుమీ.

ఆగడు చెందును, నలిగిపోవును
మిగుల మెల్లఁగ నిశము కాలిని
వగలఁ బెట్టకు దానిపైఁబడి

త్రొక్కివేయుచును.


21


ఓయి, మిత్రుఁడ గ్లాసునిండా
పోయరా మధురసముఁ; బూర్వపు
గాయముల రాఁబోవు భయముల

మఱచిపోయెదను.

డాయుచున్నది 'ఱేపు', తాళుమ
యా, యనుచు చెప్పకుము, ఱేపులు
వేయియగు ఱేపటికి, నప్పటి

కేమియయ్యెదమో.

11

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/17&oldid=320603" నుండి వెలికితీశారు