పుట:Rubayat.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



14

అల్లదే! విరియుచు గులాబీ
మెల్లఁగాఁ బల్కెడును, వినుమో
చెల్ల! నవ్వుచుఁ గేరుచిటకును

చేరిగొంటి, సుమీ.

కొల్లగా ధనమున్న సంచికి
చిల్లిపడియెను, ధనమదంతయు
నెల్ల యెడలను నీవనంబున

జారవిడిచితిని.


15


అట్టి యీ బంగారుధాన్యము
నెట్టనను గాచికొని కొందఱు
చెట్టయిది యేమనుచు గాలికి

నిగచి కొందఱును,

ఎట్టు లై తేనేమి బంగరు
మట్టి యౌదు రెవారు వీరును?
మట్టిఁ జేరిన పిదప నేరిని

త్రవ్వితీయ రెకా,

8
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/14&oldid=320416" నుండి వెలికితీశారు