పుట:Rubayat.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



12

దట్టముగ వ్యాపించియున్న
చెట్టునీడను పాటపొత్తము
రొట్టె యొక్కటి, దాక్షరసముల

గ్లాసు నుండఁగను.

అట్టెనీవును నాదుపజ్జను
మట్టుగాఁ బాడుచును నుండఁగ
నట్టియిసుక యెడారిస్వర్గము

లీలనుండుఁగదా.


13


ఆరయుదు రైహిక సుఖంబుల
నారయుదురును బర సుఖంబుల
వారిలో నను వీరిలోనను

నేరుజ్ఞానులొగా!

ఆరుకాసుల యరువుకంటెను
మూఁడుకాసుల రొక్క మేమేల్
దూరముగనున్నట్టి యాశల

కేలపోయెదవు?

7

"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/13&oldid=320414" నుండి వెలికితీశారు