పుట:Rubayat.pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది



6

ఇదేకదా సౌఖ్యంపుదిన మన
నొదవ దివు డాతపము శీతము
పదనుతోడ గులాబి మొగమును

దుడిచె వర్షంబు.

మృదుమృదూక్తులఁ బల్లవులతో
రొదలు సల్పుచు భరతపక్షియు
నిదె గులాబికి, త్రాగుమిా, మదీ

రం బనుచుఁ బల్కున్.


7


పోయరా యీ గ్లాసునిండా
తోయరా పరి తాపవసనము
నాయెరా చలికాలమిఁక, వా

సంతికార్పులివే.

డాయుచున్నది కాలవిహగము
పాయఁగా నియమిత మిదంతయు
హాయిగా నది యింతలోనే

యెగిరిపోవుఁగదా.

4
"https://te.wikisource.org/w/index.php?title=పుట:Rubayat.pdf/10&oldid=320403" నుండి వెలికితీశారు