పుట:Rangun Rowdy Drama.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

86

రంగూన్‌రౌడీ.

శంక -- నాకా ? నీకా?

తుల - నాకేల కల్గును?

శంక - ఏలకల్గునా ! చెప్పియుండలేదా ! శంకరరావుతో శత్రుత్వముప్రాణాపాయకరమని

తుల - నీమొండితనమునకు నవ్వు వచ్చుచున్నది. పాపాత్ముడా! నే నిఁక కాలయాపనమున కోర్వను.

శంక - నేనును ఓర్వలేకున్నాను. ఇక కాలయాపన నేల ! పదిహత్యలతోపాటు పదునొకండవ హత్య. చావు దుర్మార్గుడా !

(తుపాకి ప్రేల్చును.)

తుల - హా ! హా! హంతకుడా ! (మరణించును.)

అన్న -- (తండ్రిపైఁబడి) హా ! తండ్రీ ! తండ్రీ ! మరణించితివా ? అల్లుని చేతనే హతమైతివా? ఇంక నా కేది దారి ?

శంక - ఓరీ ! నీ వెవ్వఁడవు ! వీఁడు నీకు తండ్రి యెట్లగును ?

అన్న - (చేతులు జోడించి) స్వామీ ! ఈదీనురాలు, పురుషాకారమును దాల్చియున్న మీదాసురాలు అన్నపూర్ణ.

శంక – అన్నపూర్ణ ! అన్నపూర్ణ ! భర్తను బధించుటకే సాహసించి వచ్చితివా ?

అన్న - స్వామీ ! ఈయభాగ్యురాలు అంతద్రోహము తలపెట్టలేదు. ఎట్లయిన తమదర్శనము చేయింపు మని నేను వేడుకొనగా నా తండ్రి ఈ వేషముతో నన్నిందుఁ గొనివచ్చెను.

(తెరలో) ఖూనీ హోగయా! పకడో! శంకరరావుకూ !

అన్న – ప్రాణేశ్వరా! పోలీసువారు మిమ్ము వెంబడించి వచ్చుచున్నారు. మీరు శీఘ్రముగ పారిపొండు. ఈరెండుహత్యలఫలితమును మీకు మారుగా నే ననుభవించెదను.

(తెరలో పకడో ! పకడో !)