పుట:Rangun Rowdy Drama.pdf/94

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

84

రంగూన్‌రౌడీ.

(తెరలో) పకడో, పకడో, శంకరరావుకూ పకడో. బంద్‌కరో !

శంక - (ఉలికిపడి) ఇది నామామ యగు తులసీరావు కంఠధ్వనివలె నున్నది. రానిమ్ము. వీనిప్రాణములు నేటితో సరి.

(తుపాకి సవరించుకొనును.)

[పురుషాకృతితోనున్న అన్నపూర్ణతో తులసిరావు ప్రవేశము.]

తుల - శంకరరావు ! నిలువుము. ఇంతకాలమునుండియు నన్ను తప్పించుకొని తిరిగితివికాని, ఇంక నెందును పారిపోవఁజాలవు. నేఁడు నీసర్వాపరాధములకును నిన్ను సర్కారువారి కప్పగించి నా బాధ్యతను తొలగించుకొందును.

శంక - మామగారూ ! మీకు నాపై నింత వృధాకార్పణ్య మేటికి ?

తుల - నీవు హంతకుఁడవు- చోరుఁడవు - జారుఁడవు - నీతిభ్రష్టుఁడవు - మతభ్రష్టుఁడవు - కులభ్రష్టుఁడవు- నిన్ను శిక్షంపక తప్పదు. ఈశ్వరసమ్మతముగా నీకు శిక్ష కల్గింతును.

శంక - అబ్బా ! ఎన్నిభ్రష్టతలు నాయం దారోపించినారు ! మామా! ఇన్నివిధముల భ్రష్టుఁడ నయినను అదృష్టభ్రష్టుఁడనుమాత్రము కాలేదు సుఁడీ!

తుల - ఇంతవఱకు కాకున్నను నేఁ డదికూడ కానున్నదని యెఱుఁగుము.

శంక -- కాదు. కాదు. ఎన్నటికిని కాఁజాలఁదు. వెఱ్ఱిభ్రాంతి యేల పెట్టుకొందరు. ? శంకరరావుతోడ శత్రుత్వము పాముతో చెరలాటమని యెఱింగి మర్యాదగా నిచ్చటనుండి తొలఁగిపొండు; మీ క్షేమమునకై చెప్పుచున్నాను.

తుల - కానిచో. నాక్షేమమున కపాయముగల్గునా !

శంక - తప్పక కల్గితీరును .

తుల - ఓరీ ! దుష్టుఁడా ! కులభ్రష్టుఁడా ! చేసినపాపములకు సిగ్గుపడి తలవంచుకొనక మొండితనము వహించెదవేల? వృద్ధుఁడైన రం