పుట:Rangun Rowdy Drama.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తొలిపలుకు.

ఈ “రంగూన్‌రౌడీ” అను పతిభక్తినాటకము రంగూన్ ఆంధ్ర జాతీయ నాటకసభలో నేను పనిచేయుచుండినకాలమున, 1929 వ సంవత్సరమున ఆ సభకై రచింపఁబడినది. ఈ నాటకము తొలుత ప్రదర్శింపఁ బడినపుడు రుగూన్ పురవాసులను చాల గంద్రగోళపెట్టినది. రౌడీలను దూషించుటకై ఉద్దేశింపఁబడి యీనాటకము రచింపఁబడె నని కొందఱు అభిప్రాయపడి నాటక ప్రదర్శనమునకు పూర్వమే నా కనేక నిందాపూర్వకలేఖలను సంతకములు లేకుండ వ్రాసిరి. దౌర్జన్యమునకు పేరుపడిన రంగూనునందు పౌరులవలన నపాయమునకు శంకించి ప్రదర్శకులును నేనును గూడ నాటకదినమున రక్షకభటసహాయమునుసయిత మపేక్షింపవలసినవార మైతిమి. ప్రదర్శనమును గాంచుటకు కోపముచేత ప్రజలు రారేమో యని భీతిల్లితిమిగాని ఆ నాటక మెట్లుండునో చూతమను నుద్దేశముతో ఆ నాఁడు ప్రేక్షకులు ఇసుకవేసిన రాలనిచందమున నరుదెంచి హాలంతయు నిండిపోయిరి. నాటకప్రదర్శము మొదలు మంగళమువఱకును ప్రేక్షకులు సంపూర్ణ ప్రమోదభరితమానసులై నాటకమును వీక్షించి, తొలుత మే మంత భీతిల్లితిమో అంత కధికముగా భూషింపసాగిరి. ఈ నాటకమే రంగూన్ ఆంధ్రజాతీయ నాటకసభవారిచే గోదావరి, విశాఖపట్టణము, గంజాము జిల్లాలలో నంతటను పలుసార్లు ప్రదర్శింపఁబడి మంచి కీర్తిని గణించినది. సభవారికి సువర్ణపతకాదులు బహుమతిగా నొసంగఁబడెను.

ఈ నాటకమున శంకరరాయపాత్రను ధరించిన శ్రీయుత దొమ్మేటి సూర్యనారాయణగారి రౌడీనటనము నిజముగా చూచి తీరవలసినదే. ఇందు వీరసమానమైన నటనమును గావించి గ్రుధమునకు సుస్థిరమైన సత్కీర్తిని గలిగించిరి. ఈ నాటకము రంగూనునందు గొప్పసీనుల నహాయముతో ప్రదర్శింపఁబడెను. ప్రధమ విశ్రాంతికాలమున కాకినాడ లైట్‌హౌసును, సముద్రమును, స్టీమరును, శంకరరావును తిమింగలము