పుట:Rangun Rowdy Drama.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాంకము.

69

ప్రభా - (శోకభారముతో) హా! హా! దుర్మార్గుఁడా ! కృతఘ్నుఁడా! సిగ్గులేక యెట్టిశ్రీరంగనీతులం జెప్ప సాహసించుచుంటివిరా ! పలువా!

శంక - బస్ ! బస్ ! చాలు చాలింపుము. దూషించి అల్లరిచేసి తిట్టనారంభించితివా, నీమగనితోఁబాటు నాతుపాకిదెబ్బకు హతముగాఁగలవు. జాగ్రత్త. సమ్మతియగునా చచ్చినట్లు పడియుండుము. బ్రతుకనెంచితివా మఱియొకమగనిఁ దగుల్కొని పొమ్ము. నా యభ్యంతరము లేదు.

ప్రభా - హా! భగవంతుఁడా! తుదకు నాగతి యింతవఱకుఁ దెచ్చితివా! ఇంక నే నెందుఁబోవుదును ! నా కేదిదారి ! మరణింతమన్నను యీపురమున సాగరము గాని, నది గాని లేదే! ఈ దుర్భరజీవనమున చేఁజేతల చేసికొనినపాపఫలం బనుభవించుట కెన్నినాళ్ళింకను బ్రతుకవలసి యున్నదో కదా! పరమేశ్వరా! పుణ్యాత్ముఁడైన భర్తను చంపించినపాపఫలం బూరక పోవునా ! అనుభవింపవలయు! అనుభవింపవలయు. ఒకరి నేల యనవలెను? పాపమంతయు నాది - పాపఫల మంతయు నాది; - పాపఫలపరిణామ మంతయు నాది!-ఈకృతఘ్నుని దూషించిన ఫలమేమి ! ఈతఁడు నాపాపములను నాకన్నులకుఁ గట్టి ప్రబోధితం జేసినాఁడు. ఛీ! పాపప్రపంచకము - ఇంక నీలోకమున పుణ్యపాపములకు విభేదమెక్క డ ! నాపతివంటిధర్మాత్మునకు ఘోరహత్యయు, వీనివంటి పాపాత్మున కభ్యుదయమునా ! నా కీపాపలోకముతో పనిలేదు. తుచ్ఛమైన యీకామసౌఖ్యములతో పనిలేదు. ఈ యైశ్వర్యముతో పనిలేదు. చేసినపాపములకు పరిహారముగా పరమేశ్వర ధ్యాన మొనర్చుకొనుచు, జీవితశేషమును గడిపివేయఁజాలనా ! ఓపరమేశ్వరా ! నీ దాసురాలను. పాపకూపమునుండి కన్నుల