పుట:Rangun Rowdy Drama.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

62

రంగూన్‌రౌడీ.

మోహ - ఏమో. నాతండ్రిగారిని గుర్తుపట్టలేను.

రమే - ఆపెద్దమనుష్యుని వెంట నింకొకస్త్రీ యెవ్వతెయైన వున్నదా ?

మోహ - లేదు.........కాదు, కాదు. ఉన్నది - దూరముగా కారులో నున్నది.

రమే - సరే; నీ వాడుకొనుము నాయనా !

మోహ - తాతయ్యగారూ ! మానాయనగారు నాకు కనఁబడరా ?

రమే - నేను చూపించెదను. నాయనా ! భయపడకుము.

మోహ —- (నిష్క్రమించును.)

రమే - (స్వగతం) ఈమె శంకరరావుభార్యయు, ఈబాలుఁడు కుమారుఁడు ననుటకు సందియము లేదు. ఔరా ! ఎంతక్రూరు డీశంకరరావు. ఇతఁడు నాభార్యతో యేకాంతవిహారము లారంభించి స్వ

భార్యను కత్తిచే పొడిచినాఁడే ! ఎంతసాహసి యనవలయు నీతని! ఇం కేమిక్రౌర్యము తలంచినాఁడో ! వీనిప్రవర్తనమును రహస్యముగా కనిపెట్టవలసి యున్నది. అదిగో కాలిచప్పు డగుచున్నది. వాఁడే యైయుండును. నే నిందుదాగి పరికించుచుండెదఁ గాక?

(చాటున దాగును.)

[శంకరరావు ప్రభావతితో ప్రవేశించును.]

శంక -- (అటునిటు పరికించి) ప్రభావతీ ! ఇప్పు డిచ్చట నెవ్వరును లేరు. మనము తలంచిన కార్యమున కింతకన్న మంచితరుణము దొరకదు. ఇనుపపెట్టెతాళపుచేతులను నాకు శీఘ్రముగా నిమ్ము.

ప్రభా -- (ఇచ్చి నిష్క్రమించును.)

శంక - (పెట్టెను తెఱచి ఆభరణములను దొంగిలించుచుండును.)

రమే - ( ప్ర ) ఓరీ! చోరశిఖామణీ ! ఎందుఁబోయెదవు ! నిలువుము. కృతఘ్నుఁడా అపాయస్థితిలో నుంటివని దయదలఁచి, చేరఁదీసి, నాతోడ సమానమగు ధనాధికారముల నొసంగి, యధికార్లతో