పుట:Rangun Rowdy Drama.pdf/71

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము.

61

రంగము-3.

స్థలము: రమేశ మందిరము.

[విశ్రాంతి నందియున్న అన్నపూర్ణయు, రమేశబాబు, మోహనరావు ప్రవేశము.]

రమే - బాబూ! నీపేరేమి?

మోహ - మోహనరావు,

రమే - నీతండ్రిపేరు జ్ఞాపక మున్నదా బాబూ ?

మోహ - శంకరరావుగారు.

రమే - శంకరరావుగారా ! (తల పంకించి) సరియే! నాయనా! మీరిదివర కేయూరిలో నుండువారు ?

మోహ - కాకినాడలో.

రమే - ఇక్కడికి వచ్చి యెన్నాళ్లయినది?

మోహ - ఏమో ! కొన్నా ళ్ళయినది.

రమే - సరే, పోనిమ్ము. ఆయమ్మ నీతల్లియేనా ?

మోహ - ఔను.

రమే - పేరేమి?

మోహ - అటువంటిమాట మీ రడుగవచ్చునా

రమే — (చిరునవ్వు నవ్వి) నీబుద్ధికి సంతసించితినిగాని నాయనా! నేను నీకు తాతయ్య నగుదును. తప్పులేదులే. చెప్పుము.

మోహ - అన్నపూర్ణమ్మగారు.

రమే -(ఒక పాత్రను దెచ్చి) దీనిని నీ కెవ్వ రిచ్చినారు !

మోహ - ఒకపెద్దమనుష్యుఁడు. “మీఅమ్మ మూర్ఛపోయినది - మంచి నీళ్ళు తె"మ్మని నా కిచ్చినాఁడు.

రమే - ఆపెద్దమనుష్యుఁడు నీతండ్రిగారివలెనున్నాఁడేమో చూచితివా ?