పుట:Rangun Rowdy Drama.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాంకము.

59

గంగా - (కోపముతో) అరే సువ్వర్కా, బచ్చా ఛూప్ (కొట్టును బాలుఁడు మరింత యేడ్చును.)

గంగా - అరే ఖుదా! మై క్యాకరుం ! అరే దర్వాన్ ! ఇదరావ్ యార్ - బచ్చా రోతా హై దర్వాన్ !

జయ - [ప్రవేశము] అరే భగవాన్ ! ఆర్చి ఆర్చి హైరాన్ అయిపోయినాన్రా బాబూ ! ఈ పిల్లవాణ్ణి లోపల్కి తీస్కెళ్ళి తల్లికిచ్చేసిరా ! వెళ్ళు.

జయ - సేట్‌జీ ! తమ కొకఉత్తర మొచ్చింది.

గంగా - ఇచ్చేసి వెళ్ళు. వేగిరంగా మళ్ళీ రావాలిసుమా !

జయ - (బాలునితో నిష్క్రమించును.)

(తిరిగి ప్రవేశము.)

గంగా -- (ఉత్తరము విప్పి చదువును.)

శ్రీరస్తు.

“భయంకర వీరదుర్గామహాశక్త్యై నమః గంగారాంసేట్‌గారి సన్నిధికి-

మీయింటిని మీకుమార్తెను ఆశ్రయించిన భూతం వ్రాసేదేమనఁగా."

గంగా - అరే బాబూ ! భూతం వ్రాసిన ఉత్తరమా ! భూతము అంటే?

జయ - భూతం అంటేనా? సైతాన్ !

గంగా - అరే దర్వాన్ !

జయ - అరే భగవాన్ !!

గంగా - ఈదయ్యపుత్తరం చూస్తే నాగుండె దడదడ లాడుతుంది. దీన్ని చదివి వినిపించు.

జయ - (చదువును.)

"నేను నీకుమార్తె యైన రాధాబాయిని ఆశ్రయించి వున్నాను. నేను మగభూతాన్ని. నీకుమార్తెమనస్సు జయరాం అనే వాఁడిమీద